మాములుగా సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అయితే సినిమాల బడ్జెట్ కు సినిమాల ఫలితాలకు కొన్ని కొన్ని సార్లు పొంతన ఉండదు.
ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ గారు నిలుస్తూ ఉంటాయి.ఇంకొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా కోట్లల్లో కలెక్షన్స్ సాధిస్తూ ఉంటాయి.
అలా ఇప్పటికే కేవలం లక్షల బడ్జెట్ తో సినిమాలు నిర్మించి కోట్లల్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి.అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా కూడా ఒకటి.
ఆ సినిమా బడ్జెట్ ఆరు లక్షలు అయితే ఆ సినిమా కలెక్షన్లు ఏకంగా ఎనిమిది వందల కోట్లు సంపాదించి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదానికి గురిచేసింది.ఇంతకీ ఆ సినిమా ఏది? అన్న విషయానికి వస్తే.2007 లో హారర్ సినిమా విడుదలైంది.6 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల ( 800 crore rupees )వసూళ్లను రాబట్టింది.ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది.2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు.ఈ సినిమా పేరు పారానార్మల్ యాక్టివిటీ.( Paranormal activity ) దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి.( Oren Peli ) ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు.ప్రపంచంలోని హర్రర్ విభాగంలో ఎక్కువ శాతం మంది చూసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.
పారానార్మల్ యాక్టివిటీ విజయం తర్వాత మొవు మేకర్స్ దాని సీక్వెల్ ప్లాన్ చేశారు.ఓరెన్ పెలి పారానార్మల్ యాక్టివిటీ సినిమాకి 6 సీక్వెల్ లు, స్పిన్ ఆఫ్ లను రూపొందించారు.ఈ సినిమా తొలి సీక్వెల్ 2010లో, రెండో సీక్వెల్ 2011లో, మూడో సీక్వెల్ 2012లో, నాలుగో సీక్వెల్ 2014లో, ఐదో సీక్వెల్ 2015లో, ఆరో సీక్వెల్ 2021 సంవత్సరంలో వచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా $193 మిలియన్లు వసూలు చేసింది.
రూపాయల్లో అక్షరాల 800 కోట్లు.ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.
ఈ సినిమాలో కేవలం 4 మంది నటులు మాత్రమే ఉన్నారు.ఈ చిత్రం IMDbలో 10కి 6.3 రేటింగ్ ను పొందింది.అలా తక్కువ బడ్జెట్ తో అతి కొద్ది మంది నటులతో రూపొందిన ఈ సినిమా 800 కోట్లు సాధించడం అన్నది మామూలు విషయం కాదని చెప్పాలి.