అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?

మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ( Mega Family, Allu Family )లు కలిసిపోయాయా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా అల్లు అర్జున్ ( Allu Arjun )అరెస్టుతో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 Mega And Allu Family Became Friends Again Now, Mega Family, Allu Arjun, Allu Fam-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.జరుగుతున్న పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా ఉండడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.

ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదంటూ ఫిలిం సర్కిళ్లల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక వాళ్ల అభిమానులైతే తమ సొంత ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయనే రేంజ్‌ లో ఫ్యాన్ వార్స్‌ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.

సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు.దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ మెగా హీరోలతో ఒకేచోట కలుసుకున్న సందర్భం కూడా లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది.

అప్పుడప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్, మిగిలిన మెగా హీరోల కామెంట్స్ చూస్తే గొడవలే నిజమే కావచ్చు అనిపించేవి.ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ రచ్చ పెద్ద దుమారంగా మారిపోయింది.

మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.ఇక అప్పటినుంచి ఒక్కొక్క గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది.

Telugu Allu Arjun, Allu, Allu Friends, Tollywood-Movie

కానీ ఈ మధ్యకాలంలో అవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ వచ్చాయి.ఇటీవల పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) రిలీజ్ టైమ్‌ లో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పవన్ కల్యాణ్ ఎంతో హెల్ప్ చేశారు.అంతేకాదు పుష్ప విడుదల వేళ మెగా బ్రదర్ నాగబాబు, సాయి ధరమ్ తేజ్ విషెష్‌ కూడా చెప్పారు.పుష్ప సక్సెస్ మీట్‌ లో పవన్ కళ్యాణ్‌ కి అల్లు అర్జున్ థాంక్స్ కూడా చెప్పారు.

ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ మళ్లీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారనే టాక్ మొదలైంది.ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్‌ కాగానే చిరంజీవి కదిలివచ్చారు.

అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు.ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి.

అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని మరి హుటాహుటిన తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు.

Telugu Allu Arjun, Allu, Allu Friends, Tollywood-Movie

ఆ వెంటనే నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతూనే బన్నీ ఇంటికి చేరుకున్నారు.మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం.ఇవన్నీ మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటే అనడానికి సంకేతమని టాలీవుడ్‌ లో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశం ఇచ్చారని అనుకుంటున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube