రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామానికి చెందిన దుంపెన రమేష్ కు చిన్న ప్పటి నుండి రేడియో అంటే అమితమైన ఇష్టం.1877_78 లో పదవ తరగతి పూర్తి చేసి రేడియో పై వున్న మోజు తో ఆయన 1979 లో రేడియో రిపేరింగ్ లో ట్రైనింగ్ పొందాడు.ఆ రోజుల్లో ఇంటింటికీ రేడియో వాడుకలో వుండేది.రేడియోలో వార్తలు,సినిమా పాటలు,సీరియళ్లు దేశం లోని పలు భాషల్లో ముఖ్యమైన పట్టణాలలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ ల ద్వారా ప్రసారం అవుతుండేవి.
రేడియోలో వస్తున్న ప్రోగ్రాం లే ప్రజలకు వినోదాన్ని ఇచ్చేవి.
ఆ సమయంలోనే పలు రకాల రేడియోలు ఉపయోగించేవారు అధికంగా వుండేది.
రేడియో రిపెరింగ్ కు డిమాండ్ కూడా అధికంగా వున్న పరిస్థితిని గుర్తించిన దుంపెన రమేష్ రేడియో పై మోజు రేడియో రిపేరింగ్ లో ట్రైనింగ్ చేసేలా చేసింది.ఆది కాస్తా ఆయన 1979 లొ ఎల్లారెడ్డి పేటలోని గాంధీ విగ్రహం వద్ద రేడియో షాపు పెట్టేలా చేసింది.ఎల్లారెడ్డిపేటలో మొట్ట మొదట రేడియో రిపేర్ చేయడం, రేడియోలు విక్రయిస్తూ ఉపాధి పొందాడు రమేష్.30 ఏళ్లపాటు రేడియో రిపే రింగ్ లో వున్నఆయన హాభి ,వృత్తి ఆయన ఇంటి పేరు దుంపెన ను మార్చి రేడియో రమేష్ ను చేసింది.ప్రస్తుతం ఆయన ఎల్లా రెడ్డి పేటలో స్థిర పడ్డారు.
రేడియో రమేష్ గా అందరికీ సుపరిచితులు అయ్యారు.
అందరితో ప్రేమగా, అభిమానంగా,కలివిడిగా వుండే ఆయననుగ్రామంలో దుంపెన రమేష్ అంటే ఎవరని అడుగుతారు.అదే రేడియో రమేష్ అంటే వెంటనే అందరూ గుర్తు పడుతారు.
అలా ఆయన ఇంటిపేరు మార్చిన రేడియో కాల క్రమంలో ప్రస్తుతం కనుమరుగైంది.
టెక్నాలజీ పెరిగి పోవడంతో రేడియోలు వినియోగంలో లేవు.
అదే రేడియో రమేష్ మాత్రం ఇప్పటికీ తన ఇంటిలో రేడియో వాడుతుంటారు.ఆయనకు రేడియోతో వున్న అనుబంధం ఇప్పటికీ ఆయనను రేడియో ఉపగించేలా చేసింది.
అంతే కాదు ఆయన వివిధ కంపెనీ లకు చెందిన ,వివిధ మోడల్ కు చెందిన 116 రేడియోలు సేకరించి భద్రంగా దాచుకున్నారు.రేడియో మార్చిన జీవితం ఆయనది.