ఈ మధ్యకాలంలో అబ్బాయిలు గడ్డాన్ని( Beard ) దట్టంగా పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.గడ్డం గుబురుగా ఉండడం వల్ల అబ్బాయిలు మరింత హ్యాండ్సమ్ గా మరియు స్టైలిష్ గా కనిపిస్తారు.
పైగా అమ్మాయిల్లో కూడా చాలా మంది గడ్డం దట్టంగా ఉండే అబ్బాయిలనే ఇష్టపడుతుంటారు.ఈ నేపథ్యంలోనే గడ్డం దట్టంగా పెరిగేందుకు తోడ్పడే కొన్ని సింపుల్ అండ్ పవర్ ఫుల్ టిప్స్ గురించి ఎప్పుడు తెలుసుకుందాం.
గడ్డాన్ని హెవీగా పెంచుకోవాలని భావిస్తున్న వారికి వెల్లుల్లి జ్యూస్( Garlic Juice ) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఫ్రెష్ వెల్లుల్లి జ్యూస్ ను గడ్డానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే గడ్డం గుబురుగా( Thick Beard ) పెరుగుతుంది.
అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ జ్యూస్ లో( Onion Juice ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ లిక్విడ్ ను నైట్ నిద్రించే ముందు గడ్డానికి పట్టించి ఉదయాన్నే శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా గడ్డం దట్టంగా పెరుగుతుంది.
గడ్డం పెరుగుదలలో పోషకాహారం కూడా కీలకపాత్రను పోషిస్తుంది.తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, సీడ్స్, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు వంటి ఆహారాలు తీసుకోవాలి.బయట ఆహారాలకు దూరంగా ఉండాలి.
పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల తలపై జుట్టుతో పాటు గడ్డం కూడా ఒత్తుగా పెరుగుతుంది.
ఇక దట్టమైన గడ్డాన్ని కోరుకునే పురుషులు ఒత్తిడికి దూరంగా ఉండాలి.
ధూమపానం అలవాటు మానుకోవాలి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
స్నానం చేసే సమయంలో గడ్డాన్ని శుభ్రంగా షాంపూతో క్లీన్ చేసుకోవాలి.అప్పుడప్పుడు బాదం నూనెతో గడ్డాన్ని మర్దన చేసుకుంటే ఒత్తుగా పెరగడంతో పాటు మృదువుగా కూడా మారుతుంది.