ఫేషియ‌ల్ హెయిర్ ను రిమూవ్ చేసే న్యాచుర‌ల్ రెమెడీస్ ఇవే!

ఫేషియల్ హెయిర్.( Facial Hair ) చాలా మంది అమ్మాయిలకు ఇదొక పెద్ద సమస్య.

 These Are The Natural Remedies To Remove Facial Hair Details, Natural Remedies,-TeluguStop.com

ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు అందాన్ని పాడు చేస్తాయి.స్కిన్ కలర్ ను తక్కువగా చూపిస్తాయి.

ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకునేందుకు షేవింగ్, వ్యాక్సింగ్‌ వంటి పద్ధతులను ఫాలో అవుతుంటారు.కానీ న్యాచురల్ గా కూడా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.అందుకు తోడ్పడే హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1:

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn Flour ) వేసుకోవాలి.అలాగే ఒక ఎగ్ వైట్( Egg White ) వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై హెయిర్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో చర్మాన్ని రబ్బింగ్ చేస్తూ మాస్క్ ను తొలగించాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుంది.

Telugu Tips, Corn, Egg White, Facial, Latest, Natural, Papaya, Skin Care, Skin C

రెమెడీ 2:

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు గుజ్జు, హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మిక్స్ చేయండి.ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకుని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోండి.ఈ రెమెడీని పాటించిన కూడా ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.ఫేస్ గ్లోయింగ్ గా కూడా మారుతుంది.

Telugu Tips, Corn, Egg White, Facial, Latest, Natural, Papaya, Skin Care, Skin C

ఇక ఈ రెమెడీస్‌ను పాటించడంతో పాటుగా మీరు మీ ఫేషియ‌ల్ హెయిర్ గ్రోత్ ను తగ్గించడానికి జీవనశైలిలో ప‌లు మార్పులు చేసుకోవాలి.తాజా పండ్లు, కూర‌గాయాలు, ఆకుకూర‌లు తీసుకోండి.రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి.

పాస్తా మరియు వైట్ బ్రెడ్ వంటి శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.పొగాకు మరియు మద్యం మానుకోండి.

ప్రతిరోజూ కనీసం అర‌గంట పాటు వ్యాయామం చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube