నందమూరి ఇంట్లో కూడా వివాదాలు చోటుచేసుకున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్( NTR ) ను దూరం పెడితే వచ్చారు.
ఇక హరికృష్ణ ( Hari Krishna ) మరణించిన తర్వాత ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్(Kalyan Ram) ను కూడా దూరం పెట్టడంతో ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అలాగే నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగిన ఈ ఇద్దరికి మాత్రం ఎలాంటి ఆహ్వానం ఉండదని చెప్పాలి.
ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఎన్నో వేడుకలు జరిగిన ఈ ఇద్దరికీ ఎలాంటి ఆహ్వానం అందలేదు.అయితే సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం బాలకృష్ణ( Balakrishna ) స్వర్ణోత్సవ వేడుకలు ( Golden jubilee ) ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఈయనని ఎంతో ఘనంగా సన్మానిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాజకీయ నాయకులు అలాగే ఇతర చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు అందరికీ కూడా ఆహ్వానం అందింది కానీ నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి మాత్రం ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.ఇలా నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి వేడుకకు ఎన్టీఆర్ ను అలాగే కళ్యాణ్ రామ్ ను దూరం పెడుతూ వస్తున్న నేపథ్యంలో వారి అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ తరపున ఈ ఇద్దరు హీరోలకు ఆహ్వానం అందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.