గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ చరణ్ రైమ్ ను అడిగిన నెటిజన్... కౌంటర్ ఇచ్చిన ఉపాసన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ప్రస్తుతం శంకర్( Shankar ) డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని చెప్పారు.

 Charan Fans Ask Rhyme To Give Game Changer Update , Ramcharan, Upasana,game Chan-TeluguStop.com

కానీ ఇప్పటివరకు అధికారకంగా ఎలాంటి డేట్ విడుదల చేయలేదు.ఇలాంటి తరుణంలోనే శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులలో కూడా గేమ్ ఛేంజర్ విషయంలో ఆందోళన నెలకొంది.

Telugu Charanfans, Game Changer, Ramcharan, Rhyme, Upasana-Movie

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ కూడా లేకపోవడంతో అభిమానులలో కూడా ఈ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కన్నా ఎన్టీఆర్ ఎంతో ఆలస్యంగా దేవర షూటింగ్లో పాల్గొన్నప్పటికీ ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చరణ్ ఫాన్స్ మాత్రం ఆయన సినిమా విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను సినిమాకు సంబంధించి అప్డేట్స్ అడిగిన ఎలాంటి స్పందన లేదు.

Telugu Charanfans, Game Changer, Ramcharan, Rhyme, Upasana-Movie

ఈ క్రమంలోనే రామ్ చరణ్ అభిమానులు ఏకంగా తన పెట్ అయిన రైమ్ ( Rhyme ) ఇంస్టాగ్రామ్ ఖాతాకు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఒరేయ్ రైమ్ నువ్వైనా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ తెలుసుకుని సినిమా అప్డేట్స్ ఇవ్వురా అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.ఇలా రైమ్ ఇంస్టాగ్రామ్ ఖాతాకు ఇలాంటి కామెంట్స్ రావడంతో ఉపాసన( Upasana )ఈ కామెంట్స్ పై స్పందించారు.

ఈ సందర్భంగా ఉపాసన స్పందిస్తూ రైమ్ ఏమైనా ఈ సినిమాకు ప్రొడ్యూసరా? లేకపోతే డైరెక్టరా? తను ఎలా సినిమా అప్డేట్ ఇవ్వగలరు అంటూ కామెంట్ చేసింది.దీంతో మెగా అభిమానులు వదిన నువ్వైనా అన్నయ్యకు చెప్పి ఈ సినిమా అప్డేట్స్ ఇప్పించండి అంటూ ఉపాసన పోస్టుకు పెద్ద ఎత్తున రిప్లైలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube