ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో జీవిస్తున్నాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగిన నిమిషాల్లోనే సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాము.
అయితే ఇలా సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవ్వడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇలాంటి ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఫేమస్ అవ్వడానికి వింత వింత సాహసాలు చేయడం పొరపాటుగా మారింది చాలామందికి.
ఇలా చేయడం ద్వారా చాలామంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కష్టపడుతున్నారు.దీంతో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
ముఖ్యంగా రోడ్లపై జరిగే సంఘటనలకు, పబ్లిక్ వాహనాలకు సంబంధించి చేసే వీడియోలలో అనేకమంది బలయ్యారు.
మరికొందరు జలపాతాలు అడవులు తిరుగుతూ కంటెంట్ క్రియేట్ చేయడంలో అనేక కష్టాలు పడుతున్నారు.రీల్స్( Reels ) పిక్స్ లో చాలామంది అవసరం లేని రిస్కులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి ఏకంగా 300 మొసళ్ళు ఉన్న సరస్సులోకి( 300 Crocodiles Lake ) బండిపై వెళ్లి సాహసం చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) ఆల్వార్ జిల్లాలో జరిగింది.సిలిసెహర్ అని మొసళ్ళ పార్కులు బట్టి బైకుతో విన్యాసాలు( Bike Stunts ) చేశాడు.సరస్సులో ఏకంగా 300 మొసళ్ళు ఉన్న కానీ పరిస్థితి ఎంత ప్రమాదకరం అని తెలిసిన గాని అతడు రీల్స్ కోసం ఏకంగా సరస్సులో బైకు నడుపుతూ సాహసం చేశాడు.అంతేకాదు మరోసారి జీపుతో కూడా సరస్సులకు వెళ్లి విన్యాసాలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారంది.
ఈ ఘటనతో సరస్సులో ఉన్న మొసళ్ళు ఇబ్బంది పడ్డట్టు సమాచారం.ఆ యువకులు చేసిన శబ్దాలకు సరస్సులోని మొసళ్ళు వారి నుంచి కాస్త దూరంగా వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనపై వైల్డ్ అనిమల్ సేఫ్టీ అధికారులు స్పందించారు.వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియోని చూసిన కొందరు నెటిజెన్స్ ఒకవేళ పొరపాటున ఆ బైక్ సరస్సు మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.