ట్రంప్‌పై ప్రశంసలు.. కానీ ఎవరికీ మద్ధతు ఇవ్వనంటూ వ్యాఖ్యలు, అంతుచిక్కని జుకర్‌బర్గ్ వైఖరి

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది.ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) అధికారికంగా నామినేట్ చేశారు.

 Meta Ceo Mark Zuckerberg Declines To Endorse Donald Trump Or Joe Biden For Upcom-TeluguStop.com

అయితే డెమొక్రాటిక్ పార్టీ విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది.అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం తదితర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటానికి తోడు తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ ముందు తేలిపోవడంతో ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాల్సిందిగా సొంత పార్టీ నేతలే కోరుతున్నారు.

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తదితరులు ఇప్పటికే బహిరంగంగా బైడెన్‌పై వ్యాఖ్యలు చేశారు.కోవిడ్( Covid ) బారినపడి డెలావేర్‌లోని నివాసంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.రేపో మాపో బైడెన్ కీలక ప్రకటన చేస్తారనని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Donald Trump, Donaldtrump, Joe Biden, Kamala Harris, Mark Zuckerberg, Mar

మరోవైపు.డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత ఆయనకు విజయావకాశాలు పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి.దుండగుడు కాల్పులు జరిపినా ట్రంప్ చూపిన తెగువపై ప్రశంసలు కురుస్తున్నాయి.అమెరికాకు చెందిన పలువురు సంపన్నులు, ఇతర ప్రముఖులు ట్రంప్‌కు విరాళాలు ఇచ్చేందుకు క్యూకడుతున్నారు.తాజాగా డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.( Meta CEO Mark Zuckerberg ) ఇది తన జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యమని.

విపత్కర సమయంలో ట్రంప్ చూపిన ధైర్యం చాలా స్పూర్తిని కలిగించిందన్నారు.

Telugu Donald Trump, Donaldtrump, Joe Biden, Kamala Harris, Mark Zuckerberg, Mar

ఏ అమెరికన్ పౌరుడినైనా అది చూసి భావోద్వేగానికి గురి కావాల్సిందేనని.అందుకే ట్రంప్‌ను చాలా మంది ఇష్టపడతారని, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని జుకర్ బర్గ్ క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు.

అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ మద్ధతు ఇచ్చినట్లు కాదని మెటా సీఈవో తెలిపారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.

తాను అధ్యక్షుడిగా గెలిస్తే టిక్‌టాక్‌ను నిషేధించనని, అలా చేస్తే మెటాకు లబ్ధి కలుగుతుందని వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ, కార్పోరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube