రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీస్ ఛేజింగ్.. ముగ్గురు భారతీయులు దుర్మరణం, మృతుల్లో 3 నెలల చిన్నారి

కెనడాలో( Canada ) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.మృతుల్లో ఇద్దరు భారతీయులు, వారి 3 నెలల చిన్నారి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

 Canada Indian Couple Grandson Killed In Multi-vehicle Collision Following Police-TeluguStop.com

సోమవారం అంటారియో ప్రావిన్స్‌లో( Ontario Province ) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.అంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (ఎస్ఐయూ) గురువారం విడుదల చేసిన ప్రకటనలో .భారత్‌కు చెందిన 60 ఏళ్ల పురుషుడు, 55 ఏళ్ల మహిళ , వారి మూడు నెలల చిన్నారి మృతుల్లో వున్నట్లు తెలిపారు.

విట్బీ పట్టణంలో పోలీసుల ఛేజింగ్ కారణంగా .పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఏప్రిల్ 29న రాత్రి 7.50 గంటలకు డర్హామ్ రీజినల్ పోలీస్ సర్వీస్‌కు.( Durham Regional Police ) మద్యం దుకాణంలో దోపిడీ జరిగినట్లుగా సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ కార్గో వ్యాన్‌ని గుర్తించి డర్హామ్‌లోని పలు వీధుల గుండా ఆ వ్యాన్‌ని ఫాలో చేశారు.ఈ క్రమంలో హైవేలోకి ప్రవేశించిన వ్యాన్.

( Van ) రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లింది.ఈ కారణంగా ఆరు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది.

ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.మరణించిన చిన్నారి తల్లిదండ్రులు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Telugu Canada, Canada Nri, Durham Regional, Grandson, Indian, Multi Vehicle, Ont

ప్రమాదంలో మరణించిన మరో వ్యక్తిని వ్యాన్ డ్రైవర్‌గా గుర్తించారు.ఏడుగురు పరిశోధకులు, ఒక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ , ఒక సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిపుణుడు ఈ కేసును దర్యాప్తును చేస్తున్నట్లుగా ఎస్ఐయూ తెలిపింది.ఈ ఘటనలో పోలీస్ వాహనాల ప్రమేయం వుండటంతో ఎస్ఐయూ( SIU ) రంగంలోకి దిగింది.వ్యక్తుల మరణాలు, తీవ్రమైన గాయాలు, లైంగిక వేధింపులు, తుపాకీని ఉపయోగించాల్సి వచ్చిన సందర్భాలను విచారించే అధికారిక ఏజెన్సీయే ఎస్ఐయూ.

Telugu Canada, Canada Nri, Durham Regional, Grandson, Indian, Multi Vehicle, Ont

డర్హామ్ పోలీస్ వాహనాలు కూడా ట్రాఫిక్ ప్రవాహానికి వ్యతిరేక దిశలో హైవేలోకి ప్రవేశించినట్లుగా స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.‘‘ ఎవరో గాయపడబోతున్నారు ’’ అని ఒక పోలీస్ రేడియో రికార్డింగ్‌లో ఓ అధికారి చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube