వీడియో వైరల్: ఇదేంటి భయ్యా.. ఈయన అచ్చం మోడీలా ఉన్నాడే..

ప్రపంచంలో ఒకేరకం మనుషుల్లా కనిపించే వారు ఏడుగురు ఉంటారని చాలా సార్లు వైన్ ఉంటాము.ఇందుకు తగ్గట్టు గానే గుజరాత్‌ కు చెందిన అనిల్ భాయ్ థాకర్( Anil Bhai Thakkar ) ప్రధాని మోడీ ప్రొఫైల్, హెయిర్ స్టైల్, తెల్లగడ్డం మరియు డ్రెస్సింగ్ స్టైల్‌ తో తన కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు.

 Meet The Gujarat Pani Puri Seller Who Looks Like Pm Modi Viral Video Details, Vi-TeluguStop.com

గుజరాత్‌ లోని ఆనంద్‌ లో ‘తులసి పానీ పూరీ’ లను విక్రయించే షాప్ నడుపుతున్నాడు.మోదీలా కనిపించే అనిల్ భాయ్‌ని స్థానికులంతా పీఎం మోడి అని పిలుస్తుంటారు.

ప్రధాని మోడిని( PM Modi ) పోలి ఉండడం వల్ల స్థానికులు, పర్యాటకుల నుంచి ఎంతో ప్రేమ, గౌరవం లభిస్తున్నాయని అనిల్ భాయ్ సంతోషం వ్యక్తం చేశారు.ఇంకా., అనిల్ భాయ్ మాట్లాడుతూ., తాను ప్రధానమంత్రి నుండి ప్రేరణ పొందానని.పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యతనిస్తానని., అందులో భాగంగానే దుకాణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతున్నానని అన్నారు.

అనిల్ భాయ్ స్వస్థలం జునాగఢ్.

ఈయన గత 18 ఏళ్ల నుంచి తాత స్థాపించిన ‘తులసి పానీపూరీ సెంటర్‌’ ను ( Tulasi Panipuri Center ) నడుపుతున్నాడు.కాగా, ముంబైలోని మలాద్‌కు చెందిన వికాస్ మహంతే కూడా ఇటీవల తనను ప్రధానితో పోల్చి వార్తల్లో నిలిచారు.‘గర్బా’ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube