రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) పాటించడం తప్పనిసరి.లేకపోతే, మీరు ట్రాఫిక్ పోలీసుల నుండి శిక్షార్హమైన చర్యలను ఎదుర్కోవచ్చు.
అయితే ఇలాంటి కేసుల్లో పోలీసులకు పట్టుబడిన చాలా మంది వ్యక్తులు వివిధ సాకులతో పోలీసులకు తమను తాము సమర్థించుకోవడం ప్రారంభిస్తారు.కొంతమంది వ్యక్తులు తమను వదిలిపెట్టేందుకు పోలీసులకు లంచాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు.
అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులకు( Traffic Police ) చిక్కిన బాలుడు ఏం చేసాడో చూసి చాలా మందికి నవ్వు ఆపుకోలేకపోతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్ లలో చక్కర్లు కొడుతోంది.
వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి స్కూటర్ పై( Scooter ) సరదాగా తిరుగుతున్నాడు.కొంతదూరం ప్రయాణించిన తర్వాత ట్రాఫిక్ పోలీసు అధికారికి పట్టుబడ్డాడు.దాంతో తన బైక్ బీగాలు తీసేసుకున్నారు.ఈ బాలుడి పని ట్రాఫిక్ పోలీసు అధికారులనే కాదు, నెటిజన్లను కూడా నవ్వించింది.ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బాలుడు ( Boy ) పడిన డ్రామా చూసి వారు నవ్వుకున్నారు.ఆ చిన్నారి తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూటర్ పై వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది.
ఆ సమయంలో స్కూటర్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు.
అకస్మాత్తుగా, ట్రాఫిక్ పోలీసు అధికారి దృష్టి బాలుడి స్కూటర్ పైకి వెళ్ళింది.వెంటనే వారు పిల్లల స్కూటర్ ను ఆపారు.ఇదంతా.
పోలీసులను చూసి భయపడిన బాలుడు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు.పోలీసులు ఏమీ అనకముందే అతడు వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
నా బండి వదిలెయ్ ఆంటీ.ప్లీజ్.
అని వేడుకున్నాడు.ఆంటీ, దయచేసి నన్ను వదిలేయండి అంటూ తెగ యాక్టింగ్ చేసాడు.
ఇంతలో, అతని ఇద్దరు స్నేహితులు నిశ్శబ్దంగా సమీపంలో నిలబడి ఉన్నారు.అయితే బైక్ తాళం తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తనను వదిలేయాలని ఆ బాలుడు పోలీసు కాళ్లపై పడి వేడుకున్నాడు.
బాలుడు ఏడుస్తున్నట్లు నటిస్తుండటం ట్రాఫిక్ పోలీసు అధికారి చూసి, ఆమె కూడా నవ్వింది.ప్రస్తుతం యీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
.