ప్రభాస్ రణబీర్ లలో రాముడిగా ఎవరు బాగున్నారు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

గతేడాది ఆదిపురుష్ మూవీ( Adipurush ) రిలీజైన సమయంలో దర్శకుడు ఓం రౌత్ పై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్( Prabhas ) పోషించిన రాముడి పాత్ర విషయంలో ఓం రౌత్ కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయాడని కామెంట్లు వినిపించాయి.

 Who Is Best Between Prabhas And Ranbir Details, Prabhas, Ranbir Kapoor, Bollywoo-TeluguStop.com

అయితే రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రాముడి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ కావడంతో రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నారా? రణబీర్ బాగున్నారా? అనే చర్చ జరుగుతోంది.అయితే ప్రభాస్, సౌత్ అభిమానులు మాత్రం రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నాడని చెబుతున్నారు.నార్త్ అభిమానులు మాత్రం రణబీర్ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ రామాయణం( Ramayanam ) విడుదలైన తర్వాత ఈ సర్వే పెడితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

Telugu Om Raut, Prabhas, Prabhasranbir, Raavana Role, Ramayanam, Ranbir Kapoor,

నితీష్ తివారి డైరెక్షన్ లో బాలీవుడ్ రామాయణం తెరకెక్కుతుండగా ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని సినీ అభిమానులు చెబుతున్నారు.యశ్ టాక్సిక్ సినిమాతో పాటు ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.యశ్( Yash ) రావణుడి రోల్ ను ఎంచుకోవడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

బాలీవుడ్ రామాయణం బడ్జెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.

Telugu Om Raut, Prabhas, Prabhasranbir, Raavana Role, Ramayanam, Ranbir Kapoor,

ఈ సినిమాను విదేశీ భాషల్లో సైతం విడుదల చేస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి( Sai Pallavi ) సీత రోల్ పోషిస్తుండటంతో సౌత్ భాషల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.బాలీవుడ్ రామాయణంను విమర్శలకు తావివ్వకుండా తీయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో యశ్ రావణుని పాత్రలో ఎలా ఉంటారో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube