సమర్థవంతమైన సేవలకు పేరుగాంచిన ఢిల్లీ మెట్రో( Delhi Metro ) ఇటీవల కాలంలో అసాధారణ ప్రయాణీకుల ప్రవర్తనకు వేదికగా మారింది, ఈ మెట్రోలో చాలామంది డ్యాన్సులు( Dance ) వేయడం, పాటలు పాడటం, ఇంకా చిత్రవిచిత్రమైన స్టంట్స్ చేయడం ద్వారా పాపులర్ అవుతున్నారు.ఇటీవల, ఢిల్లీ మెట్రోకు సంబంధించి మరొక వీడియో వైరల్ అయ్యింది.
ఇందులో ఉమెన్స్ కంపార్ట్‌మెంట్‌లో ఓ మహిళల బృందం ఆనందంగా పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం చూడవచ్చు.వారు సంప్రదాయ దుస్తులు ధరించి, ఎవరూ ఊహించని విధంగా వేడుక చేసుకుంటున్నట్లు కనిపించారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.
చాలా మంది నెటిజన్లు వీరి పర్ఫామెన్స్ చాలా బాగుందని పొగిడారు.ఎవరికీ హానిచేయని ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన ఈ మహిళలను( Women ) ప్రశంసించారు.అయితే ఇలాంటి కార్యకలాపాలు మెట్రో నిబంధనలకు విరుద్ధమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈ వీడియోకు 56 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, అంటే ఈ వీడియో ఎంత పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి ప్రయోజనాల కోసం ఢిల్లీ మెట్రోను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో కొట్లాటలు, రొమాన్స్ ప్రదర్శనల ఇవన్నీ వీడియోలో క్యాప్చర్ అయి ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.మెట్రోను కంటెంట్ క్రియేటర్స్‌గా కేంద్రంగా మార్చాయి.
కొద్ది రోజుల క్రితం ఇద్దరు యువతులు మెట్రో ట్రైన్ లోపల హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించారు.వారు ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలింతలతో రెచ్చిపోయారు.ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( DMRC ) ఈ సంఘటనలపై స్పందించింది, అనుచిత ప్రవర్తనను ఖండిస్తూ, ప్రయాణీకులను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించాలని గుర్తు చేసింది.అయినా ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి.