ప్రభాస్ రణబీర్ లలో రాముడిగా ఎవరు బాగున్నారు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

గతేడాది ఆదిపురుష్ మూవీ( Adipurush ) రిలీజైన సమయంలో దర్శకుడు ఓం రౌత్ పై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్( Prabhas ) పోషించిన రాముడి పాత్ర విషయంలో ఓం రౌత్ కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయాడని కామెంట్లు వినిపించాయి.

అయితే రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రాముడి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ లీక్ కావడంతో రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నారా? రణబీర్ బాగున్నారా? అనే చర్చ జరుగుతోంది.

అయితే ప్రభాస్, సౌత్ అభిమానులు మాత్రం రాముడి పాత్రలో ప్రభాస్ బాగున్నాడని చెబుతున్నారు.

నార్త్ అభిమానులు మాత్రం రణబీర్ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ రామాయణం( Ramayanam ) విడుదలైన తర్వాత ఈ సర్వే పెడితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.

"""/" / నితీష్ తివారి డైరెక్షన్ లో బాలీవుడ్ రామాయణం తెరకెక్కుతుండగా ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని సినీ అభిమానులు చెబుతున్నారు.

యశ్ టాక్సిక్ సినిమాతో పాటు ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

యశ్( Yash ) రావణుడి రోల్ ను ఎంచుకోవడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

బాలీవుడ్ రామాయణం బడ్జెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. """/" / ఈ సినిమాను విదేశీ భాషల్లో సైతం విడుదల చేస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాయిపల్లవి( Sai Pallavi ) సీత రోల్ పోషిస్తుండటంతో సౌత్ భాషల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

బాలీవుడ్ రామాయణంను విమర్శలకు తావివ్వకుండా తీయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.ఈ సినిమాలో యశ్ రావణుని పాత్రలో ఎలా ఉంటారో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.

పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!