న్యూట్రల్ ఓటర్లు జగన్ వైపేనా.. ఆ పనులు చేయడమే జగన్ కు ప్లస్ అవుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూట్రల్ ఓటర్లు( Neutral Voters ) ఎటువైపు ఉన్నారనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.అయితే సర్వేలు చేసే సంస్థల నుంచి తెలుస్తున్న వివరాల ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు న్యూట్రల్ ఓటర్లను జగన్ వైపు ( CM Jagan ) మళ్లిస్తోందని తెలుస్తోంది.

 Ap Neutral Voters Are Jagan Side Details, Ap Neutral Voters, Cm Jagan Mohan Redd-TeluguStop.com

జగన్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయనే సంగతి తెలిసిందే.

కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం కంటే జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి బాబు, పవన్ పరిమితం అయ్యారని తటస్థులు చెబుతున్నారు.

ఇతర పార్టీల హామీలను కాపీ కొట్టి పథకాలను ప్రకటించడం తప్ప కొత్త పథకాలను ప్రకటించడం కూటమికి చేత కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూటమి పథకాలను ప్రకటించినా వాటి గురించి పెద్దగా ప్రచారం చేయడం లేదు.

అందువల్ల ఆ పథకాలను అమలు చేసే అవకాశం ఉందని కూడా ఎవరూ నమ్మడం లేదు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎంత నీచంగా మాట్లాడారో విన్నాం.ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం వాలంటీర్లపై( AP Volunteers ) ప్రేమ కనబరుస్తున్నారు.వాలంటీర్లకు వేతనాలను పెంచడంతో పాటు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నారు.

అయితే వాలంటీర్లు మాత్రం ఉద్యోగాలకు రాజీనామాలు చేసి షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 60 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటిస్తున్న కొన్ని హామీలు సరైన ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు.జనసేన, బీజేపీ ఇస్తున్న హామీల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు.చంద్రబాబు, పవన్ ఎన్నికల్లో గెలుపు కోసం పడుతున్న తిప్పలు చూసి సామాన్యులు సైతం అవాక్కవుతున్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube