'మంగళగిరి ' ని వదిలిపెట్టని లోకేష్ ? అదే కారణమా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) గత కొద్ది రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని( Mangalagiri Constituency ) ఎక్కువగా పర్యటిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు పులిస్టాప్ పెట్టేశారు.

 Why Nara Lokesh Special Focus On Mangalagiri Constituency Details, Nara Lokesh,-TeluguStop.com

నిత్యం మంగళగిరి నియోజకవర్గంలోనే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా జనాలను కోరుతున్నారు.తాను గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారుస్తానని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్నారు.

గతంలో ఎప్పుడు లేనంతగా మంగళగిరి పై లోకేష్ ఫోకస్ చేశారు.బయట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు.

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) మాత్రం తన వయసును, ఎండను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టిపెట్టారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ నిత్యం జనాల్లోనే ఉంటున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ,  మిగతా ప్రాంతాల్లోనూ రోడ్డు షోలు నిర్వహిస్తూ జనాల్లో ఉంటున్నారు.కానీ దీనికి భిన్నంగా లోకేష్ మంగళగిరి దాటి ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.

ప్రతిరోజు ఉండవల్లి కరకట్ట మీద నుంచి ఉదయాన్నే బయలుదేరి మంగళగిరిలో వివిధ వర్గాలను కలుస్తూ,  నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు .

Telugu Allaramakrishna, Chandrababu, Janasena, Janasenani, Kandru Kamala, Mangal

అయితే లోకేష్ ఇక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కు కారణాలు చాలానే ఉన్నాయట.  ఇక్కడ గెలుపు అంత ఆషామాషి కాదు అనే సంకేతాలు వెలువడడం , ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య కు( Murugudu Lavanya ) స్థానికంగా గట్టిపట్టు ఉండడం , లావణ్య తల్లి కాండ్రు కమల, మామ మురుగులు హనుమంతరావుకు ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉండడం,  చేనేత సామాజిక వర్గం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం,  ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లావణ్య కావడంతో లోకేష్ కు గెలుపు పై అనుమానాలు ఉన్నాయట.

Telugu Allaramakrishna, Chandrababu, Janasena, Janasenani, Kandru Kamala, Mangal

2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసి ఓటమి చెందారు.ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని  పిక్స్ అయ్యారట.వేరే నియోజకవర్గం నుంచి ఆయనను పోటీ చేయాల్సిందిగా పార్టీలోని కీలక నేతలు ఎంతోమంది సూచించినా,  మంగళగిరి వదిలి పారిపోయాడని,  ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో  మంగళగిరి నుంచే గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

అందుకే రాష్ట్ర పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా,  మంగళగిరి పైనే ఫోకస్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube