ప్రస్తుతం ప్రపంచంలో ఏ విషయమైనా సరే కాస్త వెరైటీగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.అందుకు తగ్గట్టే ఆలోచనలు కూడా చేస్తున్నారు.
సందర్భం ఏదైనా సరే.అందరి మెప్పు పొందాలని కాస్త వెరైటీ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు ప్రజలు.పెళ్లి కార్యక్రమం ఇంట్లోని కార్యక్రమం అయిన, బయట ఏ కార్యక్రమమైనా సరే.ఇంటిని అలాగే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆడవాళ్లు తెగ ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు పనికిరాని వస్తువులను కూడా రి మోడల్ చేసి వాటిని అద్భుత కలకండంగా సృష్టిస్తారు.ఇకపోతే వాహనాలకు ఎప్పుడైనా రేడియం లేదా పెయింటింగ్ వంటి వాటితో కాస్త డెకరేషన్ చేసి ఉపయోగిస్తాము.
కాకపోతే ఓ మహిళ మాత్రం చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి వీడియో చూస్తే.
ప్రతిరోజు సోషల్ మీడియా( Social media )లో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాము.ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్( Gujarat ) రాష్ట్రంలోని హేతల్ అనే మహిళ తన భర్త కోసం వారు వాడే స్కూటీని కాస్త వెరైటీగా డెకరేషన్ చేసి తన భర్తకి గిఫ్ట్ గా చూపించింది.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో హేతల్ వారి స్కూటర్ కు సంబంధించిన కీ చైన్ నుండి స్కూటర్ టైర్ల వరకు అన్నిటిని మహిళలు వాడే వస్త్రాలంకరణలో ఉపయోగించే పూసలు, చంకీలతో ఆకర్షిణివంతంగా అలంకరించిన తర్వాత.దానిని ఓ బాక్సులో ఉంచి తన భర్తకి గిఫ్ట్ రూపంలో అందజేసింది.గిఫ్ట్ అందించిన తర్వాత తన భర్త గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగా అద్భుతమైన కళాఖండాన్ని మనం చూడవచ్చు.
ఇకపోతే ఈ వీడియోలో మొదట హేతల్ వారి స్కూటర్ ను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా డెకరేషన్ చేస్తుందో చూపిస్తుంది.ఆ తర్వాత తన భర్త కు గిఫ్ట్ బాక్స్( Gift box ) రూపంలో ఆ బైక్ ను సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తుంది.
అయితే ఈమె టాలెంట్ చూసిన నెటిజన్స్ ఆమెపై సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి.