మాజీ ఎమ్మెల్యే షకీల్( Former MLA Shakeel ) కుమారుడు రహీల్ తనపై పోలీసులు నమోదు చేసిన లుకౌట్ నోటీసులను( Lookout notices ) కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన రహీల్ పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు.
ప్రజాభవన్( Praja Bhavan ) వద్ద సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహారించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రహీల్ పిటిషన్ లో న్యాయస్థానంలో కోరారు.
అయితే డిసెంబర్ 24 హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఎదుట జరిగిన ప్రమాదంలో తనకు బదులు మరొకరిని లొంగిపోమని రహీల్ ప్రేరేపించాడు.ఈ క్రమంలోనే రహీల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.