అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో ఎమ్మేల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బుధవారం ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ( Kiran Kumar Reddy ) పీలేరు నియోజకవర్గం అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి లతో పాటు జనసేన, బీజేపి, టీడీపి నాయకులు హాజరయ్యారు.మదనపల్లెకి ( Madanapalle ) అన్ని అర్హతలు ఉన్నా జిల్లా కానివ్వకుండా ఆపింది అధికార పార్టీ అని అటువంటి వారిని ఓడించడానికి ఈ రోజు అందరూ కలిశారు అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనతో సగం నష్టపోతే జిల్లాల విభజనాతో మరింత నస్థపోయామన్నారు.దీనిపైన పుణరాలోచన చేయాల్సి ఉందన్నారు.బీజేపీ ( BJP ) మైనార్టీలకు వ్యతిరేకులు కాదు కావాలనే బురదచల్లె ఆరోపణలు చేస్తున్నారని సీఏఏ, ఎన్ఆర్సి చట్టాలు భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ చెయ్యలేదు అని అది కేవలం పక్క దేశాల పౌరులకు మన దేశ పౌరసత్వం తీసుకోవాలన్నది ఉద్దేశ్యం అని అన్నారు.
ఒక పీలేరు నియోజకవర్గం కాక నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గానికి రోడ్ల కోసం 20 కోట్లు కేటాయించడం ఘనత నాదేనని తెలిపారు.
మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మరోమారు నాకు అవకాశం ఇస్తే మదనపల్లి అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానన్నారు.నిన్న జరిగిన సిద్ధం సభకు పల్లి నియోజకవర్గం నుండి కేవలం 4000 మంది హాజరయ్యారని.
సభకు ఎవరు రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి మందు డబ్బుతో బస్సులలో సభకు తరలించారని ఎద్దేవా చేశారు.