ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఉద్యోగాలు చేస్తూ వారి ఆరోగ్యాలపై ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారు.దాని కారణంగా ప్రతిరోజు ఉదయం జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం గాని, మైదానానికి వెళ్లి వాకింగ్ చేయడం కానీ చేసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.
ప్రస్తుత కాలంలో కొంతమంది యువత మాత్రమే జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తున్నారు.వీరిలో ఎక్కువమంది ఈ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడానికి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఎందుకంటే ఈ ప్రోటీన్ పౌడర్లు ఉపయోగించడం వల్ల దృఢమైన కండరాలు ఏర్పడతాయని యువత నమ్ముతూ ఉంది.
దీనికోసం వారు ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ ఉపయోగిస్తున్నారు.ప్రోటీన్ పౌడర్ ద్రవ పదార్థంలో గ్లోబల్ ఆర్ ప్రోటీన్ ఉంటుంది.ఈ పదార్థం జున్ను ఉత్పత్తుల కోసం తీసుకుంటారు.
ఈ ప్రోటీన్ పౌడర్ శరీరానికి మేలు చేసే దానికన్నా ఎక్కువగా హానీ చేస్తుంది.ఈ ప్రోటీన్ పౌడర్లు ఉపయోగించడం వల్ల శరీరంపై ఎలాంటి హానికరమైన ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మొటిమల సమస్య( Acne problem ) పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.గుడ్లు, పాలు, మాంసం వంటి సహజ ప్రోటీన్లను తీసుకోవడం వల్ల ఇది జరిగే అవకాశాలను తగ్గించుకోవచ్చు.ప్రోటీన్ పౌడర్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం అంత మంచిది కాదు.
ప్రోటీన్ పౌడర్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) వచ్చే వస్తాయి.ఎక్కువగా జిమ్ కి వెళ్లి కసరత్తులు చేసే యువత ఈ ప్రోటీన్స్ పౌడర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే బాడీ బిల్డర్లు మంచి కంపెనీ నుంచి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలని చెబుతున్నారు.కొన్ని కంపెనీల ప్రోటీన్ పౌడర్లలో విషపూరిత లోహాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కూడా చెబుతున్నారు.
శరీరానికి ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా హాని చేస్తాయి.వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాల నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.