KCR : పరామర్శల యాత్ర మొదలుపెట్టనున్న కేసీఆర్ 

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో( Telangana Assembly Elections ) బీఆర్ఎస్ ఓటమి చెందడం, ఆ తరువాత పార్టీలో కీలక నాయకులనుకున్న వారంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ,బిజెపిలలో చేరిపోతుండడం వంటి పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ప్రభావం వచ్చే లోకసభ ఎన్నికలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు పార్టీ కీలక నాయకులందరూ సమీక్షలు చేస్తూ, ఎవరూ పార్టీని వీడి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవడంతో పాటు, ప్రజలలోనూ బీఆర్ఎస్( BRS ) కు మరింత ఆదరణ పెంచుకునే విధంగా కేసీఆర్ సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు.

స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి జనాల్లోకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోయిన రైతులు( Farmers ) ఆందోళన చెందుతూ ఉండడంతో, ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దెబ్బతిన్న పొలాలను సందర్శించారు.ఈ నేపథ్యంలో రైతులకు భరోసా ఇచ్చేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి, వారిని పరామర్శించే విధంగా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.ఏప్రిల్ మొదటి వారం తరువాత కేసీఆర్( KCR ) ఎండిపోయిన పొలాలను సందర్శించి, రైతులను పరామర్శించే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

ఏప్రిల్ మొదటి వారం తర్వాత కెసిఆర్ ఎండిపోయిన పంట పొలాలను రైతులను పరామర్శించనున్నారు.నల్గొండ, భువనగిరి, ఆలేరులలో పర్యటించి పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకోమన్నారు.

పంట పొలాల పరిశీలనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Former Minister Jagadish Reddy ) సిద్ధం చేస్తున్నారు.పంట పొలాల పరిశీలనతో పాటు, రైతులలో భరోసా నింపే విధంగా కేసీఆర్ టూర్ ను ప్లాన్ చేశారు.ఈ మేరకు రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో రూట్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నారు.

మరోవైపు చూస్తే నల్గొండ లోని సాగర్ డ్యాంలో( Sagar Dam ) నీరు డెడ్ స్టోరేజ్ కి చేరడంతో, పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదు.దీంతో సాగర్ ఆయకట్టుపై ఆధారపడిన రైతులు పొలాలు ఇప్పటికే ఎండిపోగా, బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కేసీఆర్ రైతులను పరామర్శించే విధంగా జనాల్లోకి రాబోతుండడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోబోతుండడంతో, కెసిఆర్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారబోతోంది.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు