ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు( Nama Nageswara Rao ) పేరును గులాబీ బాస్ కేసీఆర్ ( KCR )అందరి కంటే ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆయన ఎలాంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం లేదు
.దీంతో నామా పార్టీ మారుతారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.అంతేకాకుండా బీజేపీ, టీడీపీ( BJP, TDP ) మరియు జనసేన కూటమి నుంచి అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే వాదనలు సైతం వినిపించాయని తెలుస్తోంది.
అయితే పార్టీ మార్పు వ్యవహారంపై నామా స్పందించారు.తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.రానున్న ఎన్నికల్లో ఖమ్మం( Khammam ) బీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.