ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న బర్రెలక్క శిరీష( Barrelakkka Sirisha ) ఎంపీగా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే బర్రెలక్క శిరీష పెళ్లికి సంబంధించిన తీపికబురును అందించారు.
తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఆమె తాజాగా వెల్లడించారు.నిశ్చితార్థ కార్యక్రమం( Engagement ) అకస్మాత్తుగా ఫిక్స్ కావడంతో నేనెవరినీ పిలవలేకపోయానని శిరీష వెల్లడించారు.
పెళ్లి కొరకు షాపింగ్ చేస్తున్న వీడియోలను సైతం ఇన్ స్టాగ్రామ్ వేదికగా బర్రెలక్క శిరీష పంచుకోవడం గమనార్హం అయితే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు.బర్రెలక్క శిరీష తనకు బాగా పరిచయం ఉన్నవ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నికల సమయంలో ఆ వ్యక్తి శిరీషకు ఎంతగానో సపోర్ట్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బర్రెలక్క శిరీష పెళ్లి( Barrelakkka Sirisha Marriage ) ప్రకటనతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.బర్రెలక్క శిరీష రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత సక్సెస్ సాధించే విధంగా ప్రణాళిలకను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.బర్రెలక్క శిరీష త్వరలో పెళ్లి కొడుకుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.శిరీషకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

బర్రెలక్క శిరీష ఏ పొలిటికల్ పార్టీ( Political Party ) సపోర్ట్ లేకపోయినా కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో బర్రెలక్క శిరీషకు 5000 ఓట్లు వచ్చాయి.పెళ్లికి సంబంధించిన సందేహాలకు శిరీష చెక్ పెట్టారు.శిరీషకు గతంలోనే పెళ్లి జరిగిందని వార్తలు వచ్చినా ఆ వార్తల గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడలేదు.బర్రెలక్క శిరీష భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పార్టీలో అయినా చేరితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బర్రెలక్క శిరీష త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.