Chinese person : అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకిన చైనీస్ వ్యక్తికి షాకింగ్ అనుభవం.. వీడియో వైరల్…

ఇటీవల హోటల్‌లో దిగిన ఒక చైనీస్ వ్యక్తికి( Chinese person ) నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది.

ఇన్ఫినిటీ పూల్‌ అంచు నుంచి పడిపోయే ప్రమాదం నుంచి కొద్దిలో అతడు తప్పించుకోగలిగాడు.

ఈ షాకింగ్ సంఘటన వీడియోలో రికార్డు అయింది, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.ఈ హోటల్‌లో రాత్రి 9 గంటల తర్వాత పూల్ క్లోజ్ చేస్తారు, కాపలా కూడా ఎవరూ ఉండరు.

రాత్రిపూట ఇందులోకి దిగకూడదని హోటల్ నిబంధనలు చెబుతున్నా సదరు చైనీస్ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో పూల్‌లోకి దూకి ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకున్నాడు.అతను పూల్‌లో తేలియాడే పరుపుపై ​​రెస్ట్ తీసుకుందామని దాని పైకి దూకాడు కానీ సరదాగా చేసిన ఆ పనే తన ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోయాడు.

అతను పరుపుపైకి దూకినప్పుడు, అది పూల్ అంచు వైపుకు వెళ్లడం ప్రారంభించింది.పూల్ అంచు ఎలాంటి ప్రొటెక్టివ్ ఎడ్జెస్ ( Protective Edge )లేకుండా ఉంది.అంటే జారుకుంటూ వెళ్తే పూల్ లోనించి కింద పడే ప్రమాదం ఉంది.

Advertisement

అది పై అంతస్తులో ఉంటుంది కాబట్టి కింద పడితే ప్రాణాంతకమైన గాయాలు అవుతాయి లేదంటే ప్రాణాలే పోవచ్చు.అయితే చైనీస్ వ్యక్తి ఎలాంటి ఘోరంగా జరగక ముందే ఈ ప్రమాదాన్ని గ్రహించాడు.

అతను పరుపుపై నుంచి దూకి, అంచు మీదుగా వెళ్లి కింద పడిపోయేలోపే మాట్రెస్‌ను పట్టుకొని లోపలికి లాగాడు.దాంతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.

ఈ సంఘటన వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అయ్యింది.ఈ మనిషి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడాన్ని 30 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు.చాలా మంది వీక్షకులు వీడియోపై వ్యాఖ్యానిస్తూ, పరిస్థితి గురించి వారి షాక్, అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

పూల్‌లో తేలియాడే పరుపుల వంటి వస్తువులు గాలికి తేలికగా ఎగిరిపోతాయి కాబట్టి వాటి వల్ల కలిగే నష్టాలను ముందుగానే అంచనా వేసుకోవాలని కొందరు సూచించారు.మరికొందరు ఆ వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించి తనను తాను ప్రమాదంలో పడేసుకున్నాడని విమర్శించారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
పవన్ కళ్యాణ్ వెనకాల టాలీవుడ్ ఇండస్ట్రీ అందుకే నిలబడటం లేదా ?

ఈ ఘటనపై కొందరు చమత్కరిస్తే, వారిలో కొత్త భయాన్ని రేకెత్తించిందని కొందరు అంగీకరించారు.ఇన్ఫినిటీ పూల్స్ అంచులు లేకుండా వస్తాయి అంటే వాటికి ఎలాంటి ప్రొటెక్టివ్ ఎడ్జెస్ ఉండవు.

Advertisement

వీటిలో స్విమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

తాజా వార్తలు