యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలో అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా మారాయి.యాసంగి సీజన్ లో వేల రూపాయలు అప్పులు చేసి కష్టపడి పండించి పంట చేతికందే సమయంలో నీళ్ళు సరిపడా లేక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.చివరికి చివరి దశలో ఏమీ చేయలేక ఇలా పశువులకు మేతగా మారాయని నీళ్ళ శ్రీశైలం అనే రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు.కొందరు పశువుల కాపరులకు ఎంతో కొంతకు పంట పొలాలు అమ్ముకుంటుండగా,మరికొందరు సొంత పశువులకు ఆహారంగా చేసుకుంటున్నారని వాపోయారు.వర్షాలు సరిగా లేక,మండుతున్న ఎండలతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు,బావులు ఎండిపోయి అన్నదాతకు శాపంగా మారిందని,పంట నష్టపోతున్న రైతులను( Farmers ) ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.