Babloo Prithiveeraj : 56 ఏళ్ల వయసులో డేటింగ్ లో హీరో.. అనుకున్నది జరగలేదు విడిపోతున్నాం అంటూ పోస్ట్?

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారు అంతే తొందరగా విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే .

 Seethal Confirms Her Breakup With Pruthvi Raj-TeluguStop.com

అయితే టాలీవుడ్ హీరోగా విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బబ్లు పృథ్వీరాజ్ ( Babloo Prithiveeraj ) ఒకరు.ఈయన అసలు సినిమాలలో హీరోగా, విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.

అయితే ఈయన బీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు.వీరికి ఒక కుమారుడు జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా తన భార్యకు విడాకులు( Divorce ) ఇచ్చినటువంటి పృథ్వీ రాజ్ 56 ఏళ్ల వయసులో 26 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి శీతల్ ( Seethal ) అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు.ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారంటూ మరో వార్త కూడా వైరల్ అవుతుంది.అయితే ఈ వార్తలపై శీతల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

శీతల్ సోషల్ మీడియా వేదిక( Social Media )గా స్పందిస్తూ చాలా కాలంగా మా జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు.నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు.గత కొంతకాలంగా నేను పృథ్వీ రిలేషన్ లో ఉండటం వాస్తవం కానీ మేము పెళ్లి ( Marriage ) చేసుకోలేదు.సహజీవనం చేశామంతే.మేము ఊహించినట్లుగా మా రిలేషన్‌షిప్‌ ముందుకు వెళ్లలేదు.అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి.

కొద్ది నెలల క్రితమే విడిపోయాము జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా మా వ్యక్తిగత జీవితానికి కాస్త ప్రైవసీ( Privacy ) ఇవ్వాలని కోరుకుంటున్నాము అంటూ ఈమె అసలు విషయం తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube