Mint Leaves For Hair : జుట్టు ఆరోగ్యానికి అండగా పుదీనా ఆకులు.. ఇలా వాడారంటే ఎన్నో లాభాలు!

ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండే పుదీనా ఆకులు( Mint Leaves ) ఆహారానికి చక్కటి ఫ్లేవర్ ను అందిస్తాయి.బిర్యానీ మరియు నాన్ వెజ్ వంటల్లో పుదీనాను విరివిరిగా వాడుతుంటారు.

 Wonderful Benefits Of Mint Leaves For Hair-TeluguStop.com

ఆరోగ్యానికి మంచిదని చెప్పి కొందరు పుదీనాతో కషాయం, జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటారు.కొందరు స్మూతీలలో యాడ్ చేసుకుంటారు.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం పుదీనా అండగా నిలుస్తుంది.పుదీనా వల్ల ఎన్నో హెయిర్ కేర్( Hair Care ) బెనిఫిట్స్ పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు పుదీనాను ఎలా వాడాలి.? అది అందించే లాభాలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.


Telugu Care, Care Tips, Healthy, Latest, Mint, Mint Benefits, Fall-Telugu Health

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు( Curd ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు పుదీనా జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.పుదీనా ఆకులు కెరోటిన్( Keratin ) మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం.

అందువ‌ల్ల పుదీనా ఆకులు జుట్టు పెరుగుదల( Hair Growtth )ను ప్రోత్సహిస్తుంది.మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

Telugu Care, Care Tips, Healthy, Latest, Mint, Mint Benefits, Fall-Telugu Health

పుదీనా ఆకులలోని శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు( Dandruff ), తల పేను మొదలైన వాటిని నివారించడానికి ఉపయోగిస్తాయి.ఇక పెరుగు మరియు కొబ్బరి నూనె జుట్టును తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్‌ను శుభ్రపరచడానికి, మృత చర్మ కణాలను క్లియర్ చేయడానికి మరియు జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది.కాబ‌ట్టి ఆరోగ్య‌మైన జుట్టు కోసం త‌ప్ప‌కుండా ఈ పుదీనా హెయిర్ మాస్క్ ను పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube