ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను( YSRCP Candidates ) ప్రకటించనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 12.50 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 గంటల మధ్య రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఒకేసారి ప్రకటించనుంది.
2019 సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ నందిగం సురేశ్,( Nandigam Suresh ) ధర్మాన ప్రసాదరావుతో( Dharmana Prasad Rao ) అభ్యర్థులను ప్రకటించనుంది.ఇందులో భాగంగా పార్లమెంట్ లిస్టును నందిగం సురేశ్ ప్రకటించనుండగా.అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్రకటించనున్నారు.కాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయకు సీఎం జగన్( CM Jagan ) వెళ్లనున్నారు.అక్కడ వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ప్రకటన ఉండనుంది.