తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్( Allu Arjun ) స్నేహ రెడ్డి ల( Sneha Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
కాగా అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతుండగా మరొకవైపు స్నేహా రెడ్డి అల్లు కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తనకూ తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కుటుంబంతోనూ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.బన్నీ 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోగా వీళ్లకు అయాన్,( Ayaan ) అర్హ( Arha ) జన్మించిన విషయం తెలిసిందే.
ఇకపోతే తన 13వ పెళ్లి రోజు సందర్భంగా భార్యని బన్నీ తెగ పొగిడేశాడు.మన పెళ్లయి 13 ఏళ్లయిపోయింది.నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం.నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్.
మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను.హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అని అల్లు అర్జున్, భార్యతో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి క్యూట్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.ఇది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.