ఇండియన్ టీం సారధి అయినా రోహిత్ శర్మ( Rohit Sharma ) టీమ్ కి వరుస విజయాలను అందిస్తూ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక రీసెంట్ గా ఇంగ్లాండ్ తో ఆడుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల్లో భాగంగా ఇప్పటికే 3-1 తేడాతో ఇండియన్ టీమ్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది.ఇక ఇదిలా ఉంటే ఇండియన్ టీమ్ మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రవీణ్ కుమార్( Former Indian Team Fast Bowler Praveen Kumar ) ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రోహిత్ శర్మ మీద ప్రశంశల వర్షాన్ని కురిపించాడు…
ఆ ఇంటర్వ్యూ లో ఆయన రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ రోహిత్ కి ఎలా ఆడాలో తెలుసు క్రీజ్ లో తను ఉన్నప్పుడు చాలామంది బౌలర్లు( Bowlers ) భయపడుతూ ఉంటారు.ఇక ఆయన కెప్టెన్ గా అయినా, లేదంటే ప్లేయర్ గా అయిన ఆయన మ్యాచ్ గెలుపు కోసం చివరి వరకు పోరాడే తత్వం ఉన్న వ్యక్తి ఇక ఇప్పుడు ఇండియా సాధిస్తున్న విజయాలను కనక చూసుకున్నట్లయితే ఆయన కెప్టెన్సీ యొక్క ప్రభావం ఏ మేరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన మాట్లాడుతూ అలాగే గ్రౌండ్ లో ఎవరైనా ప్లేయర్ తప్పు చేసినా కూడా వాళ్ళని తిట్టకుండా నిందించకుండా ఇంకోసారి బాగా ఆడమని చెబుతూ వాళ్లకి ఒక హగ్ ఇస్తాడు.అది చాలా ఇష్టంతో ప్రేమతో కూడుకున్న హగ్ గా ప్రతి ప్లేయర్ భావిస్తాడు.
అందువల్లే ఆ ప్లేయర్ల యొక్క ఆట తీరు తర్వాత మ్యాచ్ ల్లో చాలావరకు మెరుగవుతుంది అంటూ చెప్పాడు.ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్( IPL ) గురించి కూడా మాట్లాడుతూ ఐపిఎల్ లో ముంబై టీం కి ఇప్పటివరకు రోహిత్ శర్మ ఐదు సార్లు కప్పుని అందించాడు.అలాంటి సమయంలో ఆయనకు ఏ విషయం చెప్పకుండా ముంబై యాజమాన్యం సడన్ గా ఆయన్ని టీం కెప్టెన్( Team Captain ) గా తప్పించడం అనేది సరైన నిర్ణయం కాదేమో అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా తన బాధ్యతను నిర్వహించుకోవాల్సిన అవసరమైతే ఉంది అంటూ పాండ్య కి కూడా బెస్ట్ విషెస్ చెప్పాడు…
.