వరుస కేసులు, న్యాయ పోరాటాలతో తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) పెద్ద ఊరట లభించింది.కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్‌లో( Colorado Republican Primary Ballot ) ట్రంప్ కొనసాగవచ్చని ఆ దేశ సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.
తిరుగుబాటులో పాల్గొన్న ఎవరైనా ప్రభుత్వ పదవిని నిర్వహించలేరని అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణను ఉపయోగించి కొలరాడో రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం ట్రంప్‌ను బ్యాలెట్ నుంచి తొలగించేందుకు ప్రయత్నించింది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్( Supreme Court ) తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు తన ట్రూతో సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘‘ బిగ్ విన్ ఫర్ అమెరికా ’’ అని పోస్ట్ చేశారు.
సుప్రీంకోర్ట్ తీర్పు.ఇల్లినాయిస్, మైనే వంటి ఇతర రాష్ట్రాల్లో 14వ సవరణ ఆధారంగా బ్యాలెట్ నుంచి ట్రంప్‌ను అనర్హులుగా ప్రకటించడానికి చేస్తున్న ఇదే విధమైన ప్రయత్నాలకు ముగింపు పలికినట్లయ్యింది.6-3 సంప్రదాయవాద మెజారిటీ వున్న సుప్రీంకోర్టు.ఫెడరల్ అధికారులు, అభ్యర్ధులపై ఈ నిబంధనను అమలు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే వుందని స్పష్టం చేసింది.‘‘ రాష్ట్ర పదవిని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను .రాష్ట్రాలు అనర్హులుగా ప్రకటించవచ్చని మేం నిర్ధారించాము.అయితే ఫెడరల్ కార్యాలయాలకు, ముఖ్యంగా అధ్యక్షుడికి సంబంధించి సెక్షన్ 3 ని అమలు చేయడానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు అధికారం లేదు ’’ అని ధర్మాసనం పేర్కొంది.
చాలా రాష్ట్రాలు తమ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలు , కాకస్‌లను నిర్వహించే రోజు (సూపర్ ట్యూస్‌డే)కి ఒక రోజు ముందు ఈ తీర్పును వెలువరించడం గమనార్హం.2020 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ప్రయత్నించినట్లుగా డొనాల్డ్ ట్రంప్ రెండు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.ఒకటి వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ కోర్టులో,( Federal Court ) మరొకటి జార్జియాలోని స్టేట్ కోర్టులో విచారణ దశలో వుంది.తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.
రాజకీయంగా ప్రేరేపితమై ప్రాసిక్యూటర్లు తన ఎన్నికల ప్రయత్నాలను అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశం కాగా.జనవరి 6, 2021న యూఎస్ క్యాపిటల్‌పై దాడి( US Capitol Attack ) చేసేలా తన మద్ధతుదారులను ట్రంప్ ఉసిగొల్పారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.దేశ అత్యున్నత పదవికి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్ట్ ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే .రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో ఆయన పేరును చేర్చరాదని ధర్మాసనం వెల్లడించింది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్.కొత్తగా ఎన్నికైన డెమొక్రాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని న్యాయస్థానం తేల్చింది.ఈ నేరానికి గాను అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం ట్రంప్.
రాజ్యాంగ పదవులకు అనర్హుడని ఏడుగురు సభ్యులతో కూడిన కొలరాడో సుప్రీంకోర్ట్ 4 – 3 మెజారిటీతో తీర్పును వెలువరించింది.