New York Tiny Apartment : కిచెన్ లేదు, టాయిలెట్ లేదు.. న్యూయార్క్‌లోని ఈ చిన్న అపార్ట్‌మెంట్ ధర తెలిస్తే..

చాలా మంది ప్రజలు న్యూయార్క్( New York ) నగరంలో నివసించాలని కలలు కంటారు, ఎందుకంటే అక్కడ బాగా డబ్బు సంపాదించవచ్చు, మంచి సిటీ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.అయితే అక్కడ మంచి ఇంటిని కనుగొనడం చాలా కష్టం, ఖరీదైనది.

 Inside The Tiniest Apartment In New York With No Bathroom No Kitchen Video Vira-TeluguStop.com

చాలా మంది ప్రజలు నివసించడానికి మంచి స్థలాన్ని అద్దెకు తీసుకోలేరు లేదా కొనలేరు.ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక వీడియో న్యూయార్క్ నగరంలో హౌసింగ్ సమస్య ఎంత ఘోరంగా ఉందో చూపించింది.

ఇళ్లు అమ్మే ఓమర్ లాబాక్ దీన్ని పోస్ట్ చేశారు.

అతను మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని( Midtown Manhattan ) ఒక భవనంలో చాలా చిన్న గదిని( Small Room ) చూపించాడు.

అదే అపార్ట్ మెంట్ అని, కానీ అందులో బాత్రూమ్, కిచెన్ లేవని చెప్పాడు.అందులో ఒక మంచం, గది, కిటికీ మాత్రమే ఉన్నాయి.కిటికీ ఒక మెటల్ నిచ్చెన, అందులో నుంచి ఇతర భవనాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ చిన్న గదికే నెలకు అద్దె 1,200 డాలర్లు (సుమారు రూ.1 లక్ష) నెల నెల అద్దె చెల్లించుకోవాల్సి ఉంటుందని అతడు చెప్పి షాక్ ఇచ్చాడు.

బాత్రూమ్‌ను( Bathroom ) ఉపయోగించాలంటే, అక్కడ నివసించే వ్యక్తులు తమ గది వెలుపలికి వెళ్లి హాలులో నడవాలని అసహనం వ్యక్తం చేశాడు.వారు భవనంలో నివసించే ఇతర వ్యక్తులతో బాత్రూమ్‌ను పంచుకోవాలట.బాత్రూంలో సింక్, టాయిలెట్, షవర్ ఉన్నాయి.

వీడియో చివరలో, ఓమర్ లాబాక్( Omer Labock ) “మీరు ఇక్కడ నివసిస్తారా?” అని ఫాలోవర్లను అడిగాడు.వీడియో చూసిన చాలా మంది ఆగ్రహంతో పాటు ఆందోళనకు గురయ్యారు.

ఆ గది అపార్ట్‌మెంట్ కాదని, రూమింగ్ హౌస్ లో ఉన్న గది అని చెప్పారు.

ఇంత చిన్న, చెడ్డ ప్రదేశానికి ఇంత డబ్బు వసూలు చేయడం చట్ట విరుద్ధమని, అన్యాయమన్నారు.దీనికి బదులు తమ కారులో లేదా మరెక్కడైనా నివసించడానికి ప్రాధాన్యత చూపుతామని చెప్పారు.రూమ్ స్టోరేజీ యూనిట్ లాంటిదని, ఇల్లు కాదని చెప్పారు.

వీడియో చూసిన ఒక వ్యక్తి సేమ్ అమౌంట్ చెల్లించి లాస్ వెగాస్‌లోని ఒక పెద్ద ఇంట్లో నివసించినట్లు చెప్పారు.అందులో మూడు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు, ఒక గ్యారేజీ ఉన్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube