ఈతరం హీరోయిన్లలో సాయిపల్లవి( Sai Pallavi ) రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
సాయిపల్లవి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులకు అంతంతకంతకూ దగ్గరవుతున్నారు.అయితే సాయిపల్లవి తన సినీ కెరీర్ లో రొమాంటిక్ సాంగ్స్ కు, సీన్స్ కు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఒక సినిమాలో రొమాంటిక్ సాంగ్ కు సాయిపల్లవి ఓకే చెప్పారని సమాచారం అందుతోంది.కథ డిమాండ్ చేయడంతో సాయిపల్లవి రొమాంటిక్ సాంగ్ కు అంగీకరించారని తెలుస్తోంది.
వరుస విజయాలతో జోరుమీదున్న శివకార్తికేయన్( Siva Karthikeyan ) హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో శివకార్తికేయన్ సైనికుడి పాత్రలో( Soldier Role ) కనిపించనున్నారు.రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.కశ్మీర్ లో 3 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంది.
మరో 10 రోజుల్లో ఈ సినిమా షూట్ పూర్తి కానుండగా హద్దులు దాటకుండా సాయిపల్లవి ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్( Romantic Song ) షూట్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.సాయిపల్లవి రెండు కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటుండగా రొమాంటిక్ సాంగ్ లో సాయిపల్లవి ఎలా కనిపిస్తారో చూడాల్సి ఉంది.

భవిష్యత్తులో సినిమా ఆఫర్లు తగ్గితే మాత్రం డాక్టర్ గా స్థిరపడాలని సాయిపల్లవి ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది.సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.సాయిపల్లవి తండేల్ సినిమాతో( Tandel Movie ) బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సాయిపల్లవి తెలుగు, తమిళ భాషల సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం.
సాయిపల్లవి కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







