జూనియర్ ఎన్టీఆర్…( Jr NTR ) నందమూరి నట వారసుడిగా ప్రస్తుతం తన జనరేషన్ లో కేవలం తారక్ మాత్రమే స్టార్ డం అందుకున్న ఏకైక హీరోగా నిలబడ్డాడు.తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని బాబాయ్ బాలకృష్ణ కొనసాగించగా మూడవ జనరేషన్ లో మాత్రం ఆ స్టార్ డం ఉన్న నటుడు మరొకరు లేరు కేవలం తారక్ తప్ప.
కానీ మొదటి నుంచి తారక్ తన సొంత కుటుంబంలోనే అవమానాల పాలైన సంగతి మన అందరికీ తెలిసిందే.హరికృష్ణ( Hari Krishna ) రెండవ భార్య శాలిని కి( Shalini ) పుట్టిన తారక్ నందమూరి కుటుంబం చేత ఎన్నో చీత్కారాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే నందమూరి హీరోలకు ఎవ్వరికీ లేని స్టార్ డం తారక్ కి రావడంతో అందరూ ప్రస్తుతం బాగానే అతడిని ఓన్ చేసుకున్నారు.
ఇక తన జీవితంలో పడ్డ అవమానాలనే మెట్లుగా విజయాన్ని అందుకోవడానికి ఎంతో కష్టాన్ని చూడాల్సి వచ్చింది తారక్.తన తల్లి శాలిని చాలా కష్టపడి తారక్ ని పెంచింది.చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే తారక్ కి శాలిని దారిలో పెట్టడానికి ఎన్నోసార్లు ఇబ్బంది పడిందట.
అయితే షాలిని నలుగురితో ఎక్కువగా కలిసేది కాదట.చాలా తక్కువ మందితోనే ఆమె మాట్లాడేది అట.అంతేకాదు ఎప్పుడూ ఒక మాట కూడా చెబుతుండేదట.మన కష్టాన్ని పంచుకోవడానికి నలుగురు ఉన్నా చాలు.
మన చుట్టూ మందలుగా జనాలతో పనిలేదు.అందుకే నీ మనసు తెలిసిన నలుగురిని మాత్రమే పక్కన పెట్టుకో అని చెప్పేదట.
ఆ విషయాన్ని తారక్ తన కెరీర్ తొలినాళ్లలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేస్తూ తన తల్లి శాలిని చెప్పిన మాటను గుర్తుచేస్తూ తన తల్లి( Jr NTR Mother ) ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు కాబట్టి తనను కూడా పదిమందిలో తిరగాల్సిన పనిలేదని, నలుగురు సరైన స్నేహితులు ఉంటే చాలని సలహా ఇచ్చేదని అదే సలహా ఇప్పటికే పాటిస్తున్నానని నేనెక్కడుంటే అక్కడ జనాలు చాలానే వస్తారు కానీ నాకు కావాల్సిన వాళ్ళు మహా అయితే ఒక ఏడుగురు మాత్రమే ఉంటారని, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వారితోనే పంచుకుంటానని, నాటి నుంచి నేటి వరకు వారు మాత్రమే నా స్నేహితులు( Jr NTR Friends ) అంటూ తారకు చెప్పడం విశేషం.