ఇటీవల కాలంలో విమానాల్లో దాడులు ఎక్కువవుతున్నాయి.ఇలాంటి దురుసు ప్రవర్తన గల ప్యాసింజర్ల వల్ల విమాన సిబ్బంది నరకం చూస్తున్నారు.
తాజాగా ఓ ప్యాసింజర్ షర్టు విప్పేసి విమాన సహాయకుడిపై దాడి చేశాడు.చొక్కా లేని ఆ వ్యక్తి విమానంలో ఫ్లైట్ అటెండెంట్‌పై పంచుల వర్షం కురిపించడం చూసి ప్యాసింజర్లు షాక్ అయ్యారు.
ఈ వ్యక్తి టాయిలెట్ తలుపును( toilet door ) కూడా పగలగొట్టాడు.ఫిబ్రవరి 7న బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళ్లే థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ సంఘటన జరిగింది.
ఈ దాడిని ఒక ప్యాసింజర్ వీడియో( Passenger vide ) రికార్డ్ చేశారు.35 ఏళ్ల సదరు మొరటు ప్యాసింజర్ అటెండెంట్ ముఖంపై కొట్టినట్లు వీడియోలో కనిపించింది.గట్టి పంచ్ కారణంగా అటెండెంట్ కింద పడిపోయాడు.అప్పటికీ అతడు శాంతించలేదు.చాలా కోపంగా అటు ఇటు చూస్తూ మిగతా వారిని వణికి పోయేలా చేసాడు.ఇతర ప్రయాణికులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వారు అతని చేతులను ఒక వస్తువుతో కట్టారు.అతడి పక్కనే కూర్చున్న ఓ మహిళ వీడియో తీసింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
టాయిలెట్‌లో ఉన్న వ్యక్తి చాలా శబ్దం చేశాడని మహిళ చెప్పింది.అతను తలుపు పగులగొట్టగా అది బయటకు వచ్చిందట.వైట్ టీ షర్టు ( White t-shirt )వేసుకున్న ఓ పెద్దాయన అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.
కానీ వారి మధ్య గొడవ జరిగింది.తరువాత ఆ వ్యక్తి అటెండెంట్‌ను కొట్టాడు.
అటెండెంట్ ముక్కు విరిగిపోయిందేమోనని మహిళ కామెంట్లు చేసింది.ఈ ఘటన వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఆ వ్యక్తి శాంతించకపోతే విమానం లండన్‌కు బదులు దుబాయ్‌కి( Dubai instead of London ) వెళ్లాల్సి వస్తుందన్నట్లు సిబ్బంది ప్రకటించింది.అయితే అదృష్టవశాత్తూ ఆ ఆలస్యం జరగలేదు.
అనుకున్న ప్రకారం విమానం లండన్ కు వెళ్లింది.
ఇద్దరు ప్రయాణికులు ఆ వ్యక్తి పక్కనే కూర్చుని అతడిని పట్టుకున్నారని కూడా ఆ మహిళ చెప్పింది.ఆ వ్యక్తి అరుస్తూ చెడుగా మాట్లాడుతున్నాడని తెలిపింది.విమానం లండన్ చేరుకోగానే పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతను అటెండెంట్‌ను తీవ్రంగా గాయపరిచాడని, విమానాన్ని ప్రమాదంలో పడవేసాడని వారు కేసు ఫైల్ చేశారు.ప్రస్తుతం ఈ ప్యాసింజర్ జైల్లోనే ఉండగా అటెండెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతడి పరిస్థితి విషమంగా లేదని పోలీసులు తెలిపారు.