Janasena Nagababu : ‘మెగా ‘ బ్రదర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా ? 

జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Mega Brother Naga Babu ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు.ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మెగా అభిమానులు అందరిని ఏకం చేసే పనిలో నాగబాబు నిమగ్నం అయ్యారు.

 Naga Babu Meeting With Mega Fans In Anakapalli-TeluguStop.com

ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ సీటు( Anakapalli Parliament Seat )పై కన్నేసిన నాగబాబు ఆ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ,  ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ జనసేన బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.  ఎక్కువగా ఆ పార్లమెంట్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే గత ప్రజారాజ్యం సమయంలో నాగబాబు కీలకంగా వ్యవహరించారు.మెగా అభిమానులు( Mega Fans ) అందరినీ ఏకం చేసే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

Telugu Anakapalli, Ap, Janasena, Fans, Nagababu, Pawan Kalyan, Tdpjanasena-Polit

 ఇక ప్రజారాజ్యం( Prajarajyam ) కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత మెగా హీరోల ఫ్యాన్స్ అంతా చెల్లాచెదురు అయ్యారు.దీంతో పొలిటికల్ గా నాగబాబు సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం నాగబాబు తన సోదరుడు స్థాపించిన జనసేన పార్టీ( Janasena Party )లో కీలకంగా వ్యవహరిస్తున్నారు .మెగా అభిమానులు అందరిని ఏకతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు .చిరంజీవి,  పవన్ కళ్యాణ్,  అల్లు అర్జున్, రామ్ చరణ్ మెగా హీరోలందరి అభిమానులు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి,  వచ్చే ఎన్నికల్లో జనసేనకు వీరంతా మద్దతుగా నిలబడే విధంగా నాగబాబు సమన్వయ బాధ్యతలను చూస్తున్నారు.తాజాగా అనకాపల్లిలో మెగా ఫాన్స్ ఆత్మీయ సమ్మేళనంలో నాగబాబు పాల్గొన్నారు.

సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్.మిగిలిన సమయంలో జన సైనికులం , వీర మహిళలం అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.

Telugu Anakapalli, Ap, Janasena, Fans, Nagababu, Pawan Kalyan, Tdpjanasena-Polit

 ప్రస్తుతం మెగా ఫాన్స్ అంత విడివిడిగా ఉన్నారు.వీరందరినీ ఏకం చేసి జనసేనకు మద్దతుదారులుగా మార్చేందుకు నాగబాబు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ,  ఆ ప్రాంతంలో జనసేనను బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పై ఫోకస్ చేసిన నాగబాబు అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube