వరంగల్ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) కు షాక్ తగిలింది.మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ను వీడనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) కాంగ్రెస్ గూటికి చేరతారని తెలుస్తోంది.చేరిక అంశంపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజయ్య చర్చలు జరిపారని సమాచారం.
ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్( Congress ) లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాజయ్య భంగపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.