బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కౌంటర్ ఇచ్చారు.దళిత యువకుడు బలవన్మరణం చేసుకుంటే బాధితులను పరామర్శించకుండా ఒక నేరస్థుడిని పరామర్శిస్తారా అని ప్రకటించారు.
అప్పుడు బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్( BRS Friendly Police ) కాబట్టే పోలీసులు మీకు పని చేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.అందుకే దళిత యువకుడు బలవన్మరణం చేసుకున్నారని చెప్పారు.బీఆర్ఎస్ హయాంలో నమోదైన కేసుతో తమకేం సంబంధం అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.