పుచ్చకాయల పంటను ఆశించే పచ్చ మచ్చల వైరస్ ను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

పుచ్చకాయల పంట( Watermelon Farming )ను ఆశించే పచ్చ మచ్చల వైరస్ చాలా కాలం పాటు మట్టిలో ఉండే మొక్కల అవశేషాలలో జీవించి ఉంటుంది.ఈ వైరస్ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, మొక్కలకు గాయాలు కావడం లాంటి వాటి వల్ల వ్యాపిస్తుంది.

 Watermelon Cultivation Techniques,watermelon, Cultivation,watermelon Farming,agr-TeluguStop.com

అంటు కట్టడం వల్ల ఇతర మొక్కలకు ఈ వైరస్ చాలా సులభంగా సోకుతుంది.ఒకసారి మొక్కకు ఈ వైరస్ సోకిందంటే నివారించడం చాలా కష్టం.

గ్రీన్ హౌసెస్ లో పండించే పంటకు ఈ వైరస్ల నుండి సంక్రమణల సంఖ్య పెరుగుతుంది.పుచ్చకాయ మొక్క లేత ఆకులపై లేత పసుపు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడడం, ఆకులు పాలిపోవడం జరిగితే ఆ మొక్కకు ఈ వైరస్ సోకినట్టే.

ఇక క్రమంగా ఆకులు రాలిపోవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు నిర్జీవంగా మారడం జరుగుతుంది.

ఈ వైరస్ వల్ల పుచ్చకాయ పండ్లపై( Watermelon Cultivattion ) అధిక మొత్తంలో మచ్చలు, చారలు ఏర్పడతాయి.దీంతో పండ్లు ముందుగానే రాలిపోతాయి.కంపెనీ సర్టిఫైడ్ తెగులు నిరోధక విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.

పొలంలో పనిచేస్తున్నప్పుడు పరిశుభ్రం చేసిన పనిముట్లను ఉపయోగించాలి.ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.

ఈ వైరస్ సోకిన మొక్కలను వెంటనే తొలగించి కాల్చివేయాలి.

సేంద్రియ పద్ధతి( Organic Farming )లో పుచ్చకాయ విత్తనాలను 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పొడి వేడి చేస్తే అవి చురుకైన వైరస్ కణాల నుండి విముక్తి పొందుతాయి.ఏ కీటకాలను లక్ష్యంగా చేసుకొని సేంద్రీయ క్రిమిసంహారకాలను వాడాలి.రసాయన పద్ధతిలో ఈ వైరస్ ను నివారించే పద్ధతులు అందుబాటులో లేవు.

కాబట్టి ఈ వైరస్ రాకుండా ముందుగానే సంరక్షక చర్యలు తీసుకోవాలి.ఈ తెగులు సోకే అవకాశం ఉన్న మొక్కలు ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube