మినుములు( black gram )..
వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.నవధాన్యాల్లో మినుములు కూడా ఒకటి.
మరియు భారతీయుల ఆహారంలో ఇవి ముఖ్యమైనవి.వీటిని ఉద్దులు అని కూడా పిలుస్తుంటారు.
చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్నా మినుముల్లో అనేక రకాల పోషకాలు నిండి ఉంటాయి.ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
మినుముల్లో పొటాషియం( Potassium ) కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇది మెరుగైన రక్తప్రసరణలో సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
గుండె సంబంధిత జబ్బులు దరిచేరకుండా అట్టుకట్ట వేస్తుంది.అలాగే మినుములు మధుమేహులకు అనుకూలమైనవి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.మరియు యువతలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను( Insulin , glucose levels ) సమతుల్యం చేసి డయాబెటిస్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.

ఐరన్ రిచ్ ఫుడ్స్ లో మినుములు ఒకటి.అందువల్ల రక్తహీనత ఉన్న వారికి ఇవి సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.మినుములను డైట్ లో చేర్చుకుంటే రక్తహీనతను( Anemia ) సులభంగా తరిమి కొట్టవచ్చు.ముఖ్యంగా మినుములతో తయారు చేసిన సున్నుండలు రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఎలాంటి రక్తహీనత అయినా పరార్ అవ్వాల్సిందే.
మినుముల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు ఉన్నాయి.ఇవి ఎముకలు బలంగా, దృఢంగా మారడానికి దోహదపడతాయి.బోలు ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తాయి.

ఇక మలబద్దకంతో బాధపడే వారికి మినుములు ఎంతో మేలు చేస్తాయి.మినుముల్లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉండటం వల్ల వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ క్రియ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
ఇక మినుముల్లో ఉండే పలు పోషకాలు చర్మానికి రక్తప్రసరణ మరియు ఆక్సిజన్ ను పెంచుతాయి.దాంతో మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కాంతివంతంగా కూడా మెరుస్తుంది.