అయోధ్య రామాలయంలో( Ayodhya Ram Mandir ) 500 ఏళ్ల నాటి కల సాకారం అయ్యింది.సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకను చూడటం కోసం ఎంతోమంది సినీ తారలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అయోధ్య చేరుకున్నారు.ఈ విధంగా అయోధ్యలోనే బాల రాముడి( Ram Lalla ) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము కన్నులారా చూశారు ఇక అయోధ్య వెళ్ళలేని వారు ఇంట్లోనే ఎంతో ఘనంగా పూజలు కూడా చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా చాలామంది సెలబ్రిటీలు అయోధ్య వెళ్ళలేని పక్షంలో పూజలు చేయడం సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలపడం వంటివి చేశారు.మంచు లక్ష్మి (Manchu Lakshmi) కూడా అయోధ్య రామయ్యకు ఇంట్లోనే పూజలు చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందరిలా కాకుండా మంచు లక్ష్మి కాస్త భిన్నంగా ఈ పూజా కార్యక్రమాలు చేయడం గమనార్హం.
ఈమె అయోధ్యలో( Ayodhya ) బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఇంట్లోనే ల్యాప్టాప్ లో లైవ్ చూస్తూ స్వామి వారిపై పువ్వులు చల్లుతూ హారతులు ఇస్తూ ఈ పూజలను చేశారు.ఇలా ఈమె వెరైటీగా అయోధ్య రామయ్యకు పూజలు చేయడంతో ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.మంచు లక్ష్మి ఏం మాట్లాడినా ఏ పని చేసినా అందరి దృష్టి ఆమెపై పడుతుందనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఈ వీడియో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
దీంతో నేటిజన్స్ మంచు లక్ష్మి వీడియో పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.