తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నాయి.
వరుసగా మూడు సినిమాలతో హిట్లు కొట్టాడు.ఇక బాలయ్య ఇప్పుడు కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ఇక ఇది ఇక ఉంటే బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna Teja ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు.అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో ఆయన ఎంట్రీ అనేది ఆగిపోతూ వస్తుంది.ఇక ఈ 2024వ సంవత్సరంలో తప్పకుండా తన ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.ఇక దానికోసమే హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ప్రశాంత్ వర్మ తనదైన రీతిలో హనుమాన్( Hanuman ) సినిమా క్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.కాబట్టి ఇప్పుడు మోక్షజ్ఞని పరిచయం చేసే పెద్ద బాధ్యతని మోయబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.మరి ఆయన చేసిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ( Prashant Varma ) బాలయ్య కి కథ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది.
అందులో బాలయ్య బాబు మోక్షజ్ఞ ఇద్దరు ఉండబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఫ్లాష్ బ్యాక్ లో 20 నిమిషాల పాటు వచ్చే ఎపిసోడ్ లో బాలయ్య కనిపించబోతున్న గా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ ఈ సినిమా గనక చేసినట్లయితే ప్రశాంత్ వర్మ కి, మోక్షజ్ఞకు ఇద్దరికి కూడా ఈ సినిమా బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి…
.