మనిషిని వెంటాడిన బల్లి.. శరీరం పైకి ఎలా పాకిందో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది...

కొన్ని జంతువులు, పాములు, బల్లులు, తొండలు మనుషుల కంటే చిన్నగా ఉన్నా మనుషులను భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి.ఆ సమయంలో మనుషులు కూడా భయపడిపోయి పారిపోతారు.

 The Lizard That Chased The Man..how It Crawled Up The Body , Frilled Lizard, A-TeluguStop.com

తాజాగా ఒక వ్యక్తికి ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురయ్యింది.ఆస్ట్రేలియన్ అడవులను అన్వేషిస్తున్న ఆ వ్యక్తిని ఫ్రిల్డ్ జాతికి చెందిన ఓ బల్లి( Lizard ) భయపెట్టింది.

ఆ సదరు పర్యాటకుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా( Social media )లో షేర్ చేశాడు.బల్లి నుంచి ఆ వ్యక్తి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది.

తర్వాత ఆ బల్లి అతని వెంటే పరిగెత్తి అతని మీదకు ఎక్కుతుంది.చూసేందుకు ఈ దృశ్యం చాలా భయంకరంగా అనిపిస్తుంది.

అది కరిచేస్తుందేమో, దాని విష కోరలను శరీరంలో దింపేస్తుందేమో అని వణుకు వచ్చేస్తుంది.

ఈ షాకింగ్ అనుభూతిని ఎదుర్కొన్న వ్యక్తి పేరు ఎంజో సెమాస్కోవిష్.అతను ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.“ఒక బల్లి మిమ్మల్ని చెట్టుగా తప్పుగా భావించినప్పుడు, ఇలా పైకి ఎక్కడానికి వస్తుందేమో” అని ఫన్నీగా క్యాప్షన్ జోడించాడు.ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మట్టి రోడ్డుపై బల్లి తన ముందు రెక్కల లాంటి బాగానే విచ్చుకొని పరిగెత్తుకుంటూ మనిషి వైపు రావడం చూడవచ్చు.దాని మెడ చుట్టూ పెద్ద స్కిన్ ఫ్లాప్ ఉంటుంది.

బల్లి ఎంజోని చూసి అతని వైపు పరుగెత్తుతుంది.ఎంజో కూడా పరుగెత్తాడు, కానీ బల్లి ఎంజోని పట్టుకుంటుంది.

ఎంజో కాలు, శరీరంపై బల్లి ఎక్కినట్లు వీడియోలో కనిపించింది.అది అతని భుజానికి చేరి ఆగిపోతుంది.ఆపై అది దూకి చెట్లలోకి పారిపోతుంది.ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.5.6 మిలియన్లకు పైగా ప్రజలు దీనిని చూసారు.దీనిపై చాలా మంది కామెంట్స్ చేశారు.కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు బల్లిని చూసి భయపడుతున్నామని చెప్పారు.తమ వెంట బల్లి పరుగెత్తితే అరుస్తూ ఏడుస్తారని అన్నారు.మరికొంతమంది బల్లి గురించి జోకులు వేశారు.

ఫ్రిల్డ్ లిజార్డ్ ( Frilled lizard )ఒక రకమైన జంతువు.దాని మెడ చుట్టూ స్కిన్ ఫ్లాప్ ఉంటుంది.

ఇది కోపంగా లేదా భయపడినప్పుడు ఫ్లాప్‌ను పెద్దదిగా చేస్తుంది.అది నోరు కూడా తెరిచి హిస్సింగ్ శబ్దం చేస్తుంది.

అలా శత్రువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది.ఇది వెనుక కాళ్లపై నడుస్తుంది, వెనక్కి తిరిగి చూడదు.

దాక్కోవడానికి చెట్టు దొరికే వరకు అది పరిగెత్తుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube