న్యూయార్క్ ఫ్రాడ్ కేసు .. మోసం జరిగింది వాళ్లకి కాదు, నాకు : జడ్జి ముందు ట్రంప్ వ్యాఖ్యలు

రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ విచారణ గురువారం ముగిసింది.ఇరుపక్షాలు న్యాయమూర్తి ఆర్ధర్ ఎంగోరాన్ ( Judge Arthur Engoron ) ముందు తమ వాదనలు పూర్తి చేశాయి.

 New York Fraud Trial This Is No Fraud Its A Fraud On Me Says Donald Trump Detail-TeluguStop.com

జనవరి 31 లోగా కేసుపై ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.ప్రభుత్వం నుంచి మరిన్ని రుణాలు, ప్రయోజనాలను పొందేందుకు మోసపూరిత పథకంలో ట్రంప్ తన నికర విలువను ఒక బిలియన్ డాలర్లకు పైగా పెంచారని రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం ఆరోపించింది.

అయితే ట్రంప్ తాను నిర్దోషినని చెబుతూ.న్యాయమూర్తి , అటార్నీ జనరల్‌పై మాటల దాడి చేశారు.

Telugu James, Donald Trump, Judgearthur, York Estate-Telugu NRI

అక్టోబర్ 2న ప్రారంభమై, డిసెంబర్ మధ్యలో ముగిసిన ఈ విచారణ జ్యూరీ లేని బెంచ్.దీని ఫలితంగా ట్రంప్ 370 మిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చు.అంతేకాదు .తనకు ఎంతో గుర్తింపును తెచ్చిన న్యూయార్క్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ( New York Real Estate Industry ) నుంచి శాశ్వతంగా నిషేధాన్ని ఎదుర్కోవచ్చు.ఈ కేసులో అత్యంత ప్రభావితమైన వ్యక్తిని తానేనని పేర్కొంటూ తన లాయర్ల ముగింపు వాదనల సమయంలో ట్రంప్ కొన్ని నిమిషాలు మాట్లాడాలని కోర్టును అభ్యర్ధించారు.దీంతో ఐదు నిమిషాలు మాట్లాడేందుకు ట్రంప్‌కు న్యాయమూర్తి అనుమతినిచ్చారు.

అయితే కేసుకు సంబంధించిన వాస్తవాలపై దృష్టి సారించాలని సూచించారు.అయినప్పటికీ జడ్జి సలహాను పట్టించుకోని ట్రంప్ సమ్మతి లేకుండా మాట్లాడటం ప్రారంభించారు.

Telugu James, Donald Trump, Judgearthur, York Estate-Telugu NRI

తాను అమాయకుడినని, నేను అనుభవించిన దానికి వారు నాకు చెల్లించాలని ట్రంప్ కోరారు.ఇది వినియోగదారులకు జరిగిన మోసం కాదని.తనకు జరిగిన మోసమని ఆయన వ్యాఖ్యానించారు.నేను చెప్పేది మీకు బోర్ కొట్టొచ్చు , కానీ మీకు సొంత ఎజెండా వుందని నాకు తెలుసునని న్యాయమూర్తి ఎదురుగా కూర్చొని ట్రంప్ కోపంగా అన్నారు.

విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన అటార్నీ జేమ్స్.( Attorney James ) ఈ కేసు రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు.ఈ కేసు చట్టానికి సంబంధించినదని, ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘించారని జేమ్స్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube