టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో మెగా డాటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిహారిక ( Niharika ) ప్రస్తుతం కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టారు ఒకవైపు నిర్మాతగా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాటిది ఫిష్ ( What The Fish ) అనే సినిమాలో నటించబోతున్నట్లు ఇదివరకు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాతగా నిర్మిస్తున్నారనే విషయాలు కూడా మనకు తెలిసిందే.

పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినటువంటి నిహారిక తన భర్తతో వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.అయితే ఈమె విడాకులు తీసుకున్న తర్వాత తన కెరీర్ గురించి ఫోకస్ చేస్తూ వృత్తిపరమైనటువంటి జీవితంలో బిజీ అయ్యారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను నిహారిక అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె సరదాగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నిహారిక మీ అరిచేతిని చూపించండి అంటూ ఈమెను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నిహారిక చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ సమాధానం ఇచ్చారు.ఎందుకు బాబు నా జాతకం ఏమైనా చెబుతావా అంటూ ఈమె మాట్లాడారు.నా జాతకం చెప్పడానికే నా అరచేతిని చూపించమంటున్నావా అంటూ కామెంట్ చేయడమే కాకుండా నా ఫ్యూచర్ గురించి నాకు తెలియకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను అంటూ కామెంట్ చేశారు.

అదేవిధంగా మరొక నెటిజన్ మీ ఏజ్ ఏంతో చెబుతారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఏజ్ దాచుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ ఈమె తన వయసు 30 సంవత్సరాలు అంటూ అసలు విషయం బయట పెట్టారు.ఇలా ఎన్నో విషయాల గురించి సరదాగా అభిమానులు ఈమెను ప్రశ్నించడంతో నిహారిక కూడా అంతే ఓపికగా సమాధానాలు చెప్పారు.
ఇలా వీటన్నింటినీ ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.