టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట 2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ( Varun Tej )లు గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.లావణ్య,వరుణ్ ల పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు.
గతేడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలికిన లావణ్య తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్( New Year Wishes ) ను తెలిపింది లావణ్య త్రిపాఠి.
అంతే కాకుండా 2024లో తన న్యూ రిజల్యూషన్స్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది.కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని, తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్ మీడియాకు తక్కువ టైమ్ కేటాయించాలని ఎక్కువ సమయం ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చింది లావణ్య త్రిపాఠి.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున న్యూ ఇయర్ విషెస్ ని తెలుపుతున్నారు.