ఏపీలోని మున్సిపల్ కార్మికులతో మరి కాసేపటిలో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది.ఈ మేరకు మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరపనున్నారు.
అయితే ఏపీ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తమ 13 డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.సమాన పనికి సమాన వేతనం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలకు రావాలని సర్కార్ పిలుపునిచ్చింది.