ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉండాలి అంటే పెద్ద సినిమా ఒక్కటి భారీ హిట్ అయితే చాలు అని అనుకునేవారు.ఒక్క పెద్ద స్టార్ హీరో సినిమా హిట్ అయితే వందలాది మందికి పని దొరుకుంటుంది అని అనుకునేవారు.
కానీ ఇప్పుడు ఆ రోజులు పొయ్యాయి.చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల రేంజ్ లో వసూళ్లను రాబట్టే రోజులు వచ్చేశాయ్.
కంటెంట్ ఈజ్ ది కింగ్ అని ఈ ఏడాది నిరూపించింది.ఈ ఏడాది భారీ ఆర్భాటంగా వచ్చిన సినిమాలు ఢమాల్ అన్నాయ్, ఎలాంటి చప్పుడు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు తారాజువ్వలు లాగ పైకి ఎగిశాయి.
అలా ఈ ఏడాది చిన్న సినిమాలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ వసూళ్లను రాబట్టిన సినిమాలేంటో ఒకసారి చూద్దాము.ముందుగా ఎలాంటి హడావుడి లేకుండా అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ వసూళ్లను సాధించిన ‘బలగం’( balagam ) చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి.

తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా కి జబర్దస్త్ కమెడియన్ వేణు( venu ) దర్శత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.ఈ చిత్రానికి పని చేసిన వాళ్ళెవ్వరూ కూడా ఇంత పెద్ద హిట్ అవుతుందని, కాసుల కనకవర్షం కురిపిస్తుంది ఊహించలేదు.కోటి రూపాయిల కంటే తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా తర్వాత మనమంతా ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన సినిమా ‘బేబీ’( baby ).కలర్ ఫోటో( Color photo ) లాంటి జాతీయ అవార్డు పొందిన సినిమాని నిర్మించిన సాయి రాజేష్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఈ రెండు సినిమాల రేంజ్ లో ఆడకపోయినా కూడా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన మరో చిన్న సినిమా ‘మేము ఫేమస్’( memu famous ).

అతి తక్కువ బడ్జెట్ మీద సుమంత్ అనే 23 ఏళ్ళ కుర్రాడు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించి హీరో గా కూడా చేసాడు.మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాని అధిక శాతం ఫోన్ కెమెరా తో తెరకెక్కించాడట.అలా తీసిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకొని దాదాపుగా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇది సాధారమైన విషయం అయితే అసలు కాదు.
అలా చిన్న సినిమాలుగా విడుదలైన ‘మా ఊరి పొలిమేర 2 ‘, ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించాయి.ఇక మీడియం రేంజ్ హీరోలుగా పిలవబడే న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ మరియు ‘హాయ్ నాన్న’ సినిమాలతో, అలాగే నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి.
మిస్టర్ పోలిశెట్టి’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసారో మన అందరికీ తెలిసిందే.అలా ఈ ఏడాది చిన్న సినిమాల ఏడాది గా మనం పరిగణించొచ్చు.