ఇంటర్నెట్ రోజూ వివిధ రకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తాయి.
మరికొన్ని ఏడిపిస్తాయి.ఇంకొన్ని నవ్విస్తాయి, మిగతావి ఆశ్చర్యపరుస్తుంటాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది మ్యాజిక్ కి( Magic ) సంబంధించిన వీడియో.
సాధారణంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా అందరూ మ్యాజిక్ ట్రిక్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తారు.రోడ్డుపక్కన మ్యాజిక్ చేస్తున్నా లేదా వీడియోలు చూసినా వాటికి అతక్కు పోతారు.మెజీషియన్లు చేతితో అనేక ట్రిక్స్ ప్లే చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.అలా ఎలా చేశారని అనుకుంటూ మనం నోరెళ్లబెట్టక తప్పదు.
కానీ ఒక్కసారి ఆ మ్యాజిక్ ట్రిక్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిసిపోతే మెజీషియన్ జోకర్ లాగా అనిపిస్తాడు.అయితే ఈ మెజీషియన్( Magician ) తన సీక్రెట్స్ బయట పడకుండా చాలా జాగ్రత్తగా పడతాడు.
అయితే ఒక మెజీషియన్ కి సొంత సోదరుడే శత్రువు అయ్యాడు.
ఇందులో ఒక యువకుడు మ్యాజిక్ చేస్తుంటే, అతని సోదరుడు( Brother ) అతని సీక్రెట్స్ అన్నీ బయట పెట్టాడు.వైరల్ అవుతున్న వీడియోలో, సదరు యువకుడు ఒక చేతిలో ఫోన్,( Phone ) మరో చేతిలో క్లాత్( Cloth ) పట్టుకుని మ్యాజిక్ చేయడం మనం చూడవచ్చు.ఆపై ఫోన్ మధ్యలో నుంచి క్లాత్ పోనివ్వడం చూడవచ్చు.
ఈ మేజిక్ అద్భుతంగా కనిపిస్తుంది.కానీ ఈ యువకుడి పక్కనే కూర్చున్న సోదరుడు ఆ మ్యాజిక్ వెనుక మాయలను బహిర్గతం చేయడంతో అతడి ఆట ముగుస్తుంది.
ఇంకా మిగతా ఎన్నో ట్రిక్స్ ప్లే చేసిన వాటి వెనుక ఉన్న సీక్రెట్స్ అన్ని సోదరుడు ఎక్స్‌పోజ్ చేస్తాడు దాంతో ఆ మెజీషియన్ పరువు పోతుంది.ఈ వీడియో @PicturesFoIder అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.దీనికి కోట్లల్లో వ్యూస్ వచ్చాయి.శత్రువులు ఎక్కడో ఉండరు, అన్నయ్య తమ్ముళ్ళవలె పక్కనే ఉంటారు అని దీనిని చూసి ఫన్నీగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.